ఆగస్టు రెండో వారంలో కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి బీజేపీలో చేరే అవకాశం కనిపిస్తోంది. మొదటి వారంలో కాంగ్రెస్  కు రాజీనామా చేయనున్నారు. నేటి నుంచి తన నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ నేతలతో సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. 

కాంగ్రెస్ పార్టీ నాయ‌కుడు, మునుగోడు ఎమ్మెల్యే బీజేపీలో చేర‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. వ‌చ్చే నెల మొద‌టి వారంలో ఆయ‌న కాంగ్రెస్ ను విడిచిపెట్ట‌నున్నార‌ని తెలుస్తోంది. ఆయ‌న వేస్తున్న అడుగులు గ‌మ‌నిస్తే ఈ విష‌యాలు స్పష్టం అవుతున్నాయి. నేటి నుంచి ఆయ‌న త‌న నియోజ‌క‌ర్గంలోని మండ‌లాల కాంగ్రెస్ నాయ‌కులతో స‌మావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో త‌న రాజీనామ అంశం, త‌దుప‌రి కార్య‌చ‌ర‌ణ చ‌ర్చించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. 

షాకింగ్.. పదహారేళ్ల బాలికను కిడ్నాప్ చేసి.. మూడునెలలుగా సామూహిక అత్యాచారం..

అభిమానులు, కార్య‌క‌ర్త‌ల‌తో స‌మావేశాలు నిర్వ‌హించిన త‌రువాతే ఆయ‌న ఒక అభిప్రాయానికి వ‌స్తార‌ని తెలుస్తోంది. తిరుమ‌ల తిరుప‌తి దేవస్థానాన్ని ద‌ర్శించుకున్న త‌రువాత కాంగ్రెస్ పార్టీని వీడ‌టంపై అధికారికంగా ప్ర‌క‌ట‌న చేయ‌నున్నారు. అయితే రాజీనామా విష‌యాన్ని ఆయ‌న త‌న స‌న్నిహితుల వ‌ద్ద స‌మ‌ర్థించుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. తన పార్టీని వీడే నిర్ణ‌యం వల్లే కొత్త మండలం ఏర్పాటు క‌ల సాధ్యం అయ్యింద‌ని, ఇంకా ఎన్నో అభివృద్ధి ప‌నులు జ‌రుగుతాయ‌ని ఆయ‌న చెపుతున్నారు. తాను బీజేపీలో చేరి, ఉప ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన త‌రువాత కేంద్ర ప్ర‌భుత్వంతో క‌లిసి నియోజ‌క‌వ‌ర్గాన్ని డెవ‌లప్ చేస్తానని తెలుపుతున్నారు. ఇప్పుడు ఇవే విష‌యాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లి విజ‌యం సాధించాల‌ని రాజ్ గోపాల్ రెడ్డి చూస్తున్న‌ట్టు అర్థ‌మ‌వుతోంది. 

దంతేవాడ జిల్లాలో ఎన్‌కౌంటర్‌.. రూ. 5 లక్షల రివార్డు ఉన్న మావోయిస్ట్ నేత హతం..

ఇదిలా ఉండ‌గా కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు భట్టి విక్ర‌మార్క నిన్న రాజ్ గోపాల్ రెడ్డి ఆయ‌న నివాసంలో క‌లిశారు. పార్టీని వీడ‌కూడ‌ద‌ని కోరారు. కానీ ఆయ‌న దానిని సున్నితంగా తిర‌స్క‌రించినట్టు స‌మాచారం. ఉద్య‌మంలో లేని వ్య‌క్తుల‌కు కాంగ్రెస్ పార్టీని అప్ప‌గించార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసిన‌ట్టు తెలుస్తోంది. అందుకే తాను ఆ పార్టీలో కొన‌సాగలేన‌ని చెప్పారు. సీఎం కేసీఆర్ ను ఓడించ‌డం బీజేపీకి సాధ్యం అవుతుంద‌ని తెలిపిన‌ట్టు స‌మాచారం. 

కాగా.. టీఆర్ఎస్ పార్టీ చేరిక‌ల‌ను ముమ్మ‌రం చేసింది. గ‌ట్టుప్ప‌ల్ మండ‌లం కోసం పోరాటం చేసిన ప‌లువురు నాయ‌కులు టీఆర్ఎస్ లో చేరారు. సీఎం కేసీఆర్ కు కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతూ గ‌ట్టుప‌ల్ లో స‌భ ఏర్పాటు చేస్తామ‌ని ఈ సంద‌ర్భంగా ఆ క‌మిటీ నాయ‌కులు తెలిపారు. దీంతో ఆ మునుగోడు వ్యాప్తంగా చేప‌ట్టే స‌భ‌ల‌కు శ్రీకారం చుట్టాల‌ని మినిస్ట‌ర్ జ‌గ‌దీశ్ రెడ్డి భావిస్తున్నారు. ఇప్ప‌టికే కోమ‌టి రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డిపై విమ‌ర్శ‌లు సంధిస్తున్న ఆయ‌న ఇప్పుడు దానిని మ‌రింత వేగవంతం చేశారు. కోమ‌టిరెడ్డికి బిజినెస్ లు ఎక్కువ‌ని ఆరోపించారు. నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి ప‌నులు చేయ‌లేద‌ని అన్నారు ఫ్లోరోసిస్ బాగా పెరిగిపోయింద‌ని, టీఆర్ఎస్ ప్ర‌వేశ‌పెట్టిన మిష‌న్ భ‌గీర‌థ‌తో మంచి నీళ్లు వ‌స్తున్నాయ‌ని చెప్పారు. 

Monkeypox: మంకీపాక్స్ ఆందోళ‌న‌లు.. క‌ర్నాట‌క‌ విమానాశ్రయాల్లో హై అల‌ర్ట్ !

కాగా.. సీఎం కేసీఆర్ మునుగోడులో తాజా ప‌రిస్థితిపై స‌మాచారం సేక‌రించే ప‌నిలో పడ్డార‌ని తెలుస్తోంది. ఇదే స‌మ‌యంలో కోమ‌టిరెడ్డి కూడా ఓ సంస్థ ద్వారా, అలాగే ఓ మీడియా హౌస్ ద్వారా స‌ర్వేకు చేయిస్తున్నార‌ని అర్థ‌మ‌వుతోంది. ఇదిలా ఉండ‌గా కామారెడ్డిలో ఉన్న భిక్క‌నూరు లోని దేవాల‌యాన్ని రాజ్ గోపాల్ రెడ్డి నిన్న సంద‌ర్శించారు. అక్క‌డి బీజేపీ నేత‌ల‌తో స‌మావేశం అయ్యారు. వారితో ఆగ‌స్టు రెండో వారంలో పార్టీలోకి వ‌స్తాన‌ని చెప్పిన‌ట్టు తెలుస్తోంది.