ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లాలో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. అర్ధరాత్రి నక్సలైట్లు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో భద్రతా బలగాలకు భారీ విజయం లభించింది. 

ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లాలో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. అర్ధరాత్రి నక్సలైట్లు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో భద్రతా బలగాలకు భారీ విజయం లభించింది. భద్రతా బలగాల కాల్పుల్లో నక్సలైట్ బుధ్రామ్ మార్కమ్‌ హతమయ్యాడు. ఈ విషయాన్ని బస్తర్ రేంజ్ ఐజీ ధ్రువీకరించారు. భద్రత బలగాల కాల్పుల్లో హతమైన మార్కమ్‌పై ఐదు లక్షల రివార్డు ఉన్నట్టుగా చెప్పారు. ప్రస్తుతం మొత్తం ప్రాంతాన్ని చుట్టుముట్టామని, సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని తెలిపారు.

ఆ ప్రాంతంలో ఇప్పటికీ నక్సలైట్లు దాక్కున్నట్లు భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి. హతమైన నక్సలైట్ బుధ్రామ్‌పై వివిధ నేరాలకు సంబంధించి 19 కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. కాగా, ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.