తెలంగాణ రాష్ట్ర సమితిలో సహకార ఎన్నికలు అసంతృప్తి సెగలు రగిలిస్తున్నాయి. డీసీసీబీ ఛైర్మన్ పదవి దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు గురైన కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి పీఏసీఎస్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు.

Also Read:నా డబ్బులు, చీరెలు తిరిగివ్వండి: ఓటర్లకు ఓటమి పాలైన అభ్యర్థి వినతి

రైతులకు సేవ చేయాలన్న తన లక్ష్యం నెరవేరలేదన్నా ఆయన పార్టీలోనే కొనసాగుతానని రాజీనామా లేఖలో పేర్కొన్నారు. కాగా సహకరా సంఘాల ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ హవా స్పష్టంగా కనిపించింది.

Also Read:సహకార సంఘ ఎన్నికలు.. టీఆర్ఎస్ నేత దారుణ హత్య

పలు జిల్లాల్లో ఆ పార్టీ డైరెక్టర్ పోస్టులను ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. సుమారు 11 వేల డైరెక్టర్ పోస్టులను గులాబీ పార్టీ కైవసం చేసుకోగా.. 900 సహకార సంఘాలు గులాబీ గూటికి చేరాయి. అయితే ఛైర్మన్ పోస్టుల ఎన్నికల విషయంలో మంత్రులు తమ అనుచరులకే దక్కేలా చక్రం తిప్పుతుండటంతో ఆశావహులు అసంతృప్తికి లోనవుతున్నారు.