Asianet News TeluguAsianet News Telugu

ఆమ్మో, కోదండరామ్ ఎంత మాట అనేశాడు

 కెసిఆర్ కు, ఆంధ్ర పాలకులకు తేడా లేదంటున్న ప్రొపెసర్ కోదండరామ్

Kodandaram says KCR following Andhra rulers

తెలంగాణా జెఎసి ఛెయిర్మన్ ప్రొఫెసర్ కోదండ రామ్ ముఖ్యమంత్రి కెసిఆర్ మీద ఆఖరు మాట అనేశారు.

 

ఇంతకు ముందుకు ఆయన  ‘తెలంగాణా పాలకు’ల మీద చేసిన విమర్శుల వేరు. ఇపుడు విసిరన బాణం వేరు. బహుశా  వాగ్వాదంలో ఆయన చివర మాటే అనేసినట్లుంది. కెసిఆర్ కు ఆంధ్రపాలకులకు తేడా లేదు పొమ్మన్నాడు. (కెసిఆర్ కూడా ఆంధ్రోడే, ఆయనలో పారేది ఆంధ్ర రక్తమే అనే విమర్శ  పూర్వం ఆంధ్రోళ్లు చేసే వాళ్లు.  దీనికి కోదండర్ రామ్ సర్టిఫికెట్ ఇచ్చారా?)

 

అంతేకాదు, ఇపుడు  ఈ విషయాన్ని తెలంగాణాలో ఊరూర చాటేందుకు తొందర్లో ఆయన ఒక యాత్ర చేపడుతున్నారు కూడా.

 

 కోదండరామ్  ఏదో ఒక మాట అనడం,పెద్ద పల్లి ఎంపి బాల్కసుమన్ మరొక మాట అనడం   ఈ మధ్య మామూలయింది. ఇలాంటిడ్రామాకు చెక్ పెట్టాలనుకుంటున్నట్లుంది. ప్రొఫెసర్ కోదండరామ్ చివరి మాట అనేశారు.  ఈ తెలంగాణా పాలకులకు, ఆంధ్ర పాలకులకు తేడా లేదు పొమ్మన్నాడు. దీనర్ధం చాలా దూరం పొతుంది. దాదాపు పదేళ్ల పాటు కోదండరామ్ ఆంధ్రపాలకులన వలస పాలకులని, దోపిడిపాలన చేశారని అంటూవచ్చారు.

 

ఇపుడు కెసిఆర్ ను కూడా ఆంధ్రోళ్ల జాబితాలో చేర్చడం చాలా లోతైనవిమర్శ. ఇది కెసిఆర్ చేపడుతున్న పనులన్నంటిని, ఆంధ్రోళ్లు చేపట్టిన పనులతో పోల్చడమే. అంటే ఇవన్నీ దోపిడీ పాజక్టులనేనా అర్థం.

 

నిన్న కోదండరామ్ ఖమ్మలో మాట్లాడారు. అక్కడ విద్యావంతుల వేదిక ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ సీమాంధ్ర పాలకులు అనుసరించిన అభివృద్ధి విధ్వంసకర విధానాలనే ప్రస్తుత తెలంగాణ పాలకులూ అనుసరిస్తున్నారని టీజేఏసీ చైర్మన్ కోదండరాం విమర్శించారు. దీని భావమేమిటి? నాడు సీమాంధ్ర పాలకులు ప్రవేటు కార్పొరేట్ విద్యాసంస్థలను ప్రోత్సహించి విద్య అందరికీ అందుబాటులో లేకుండా చేశారు.

 

తెలంగాణా వచ్చాక ఏమ్మారలేదని, ఇపుడు అధికారం లోకి వచ్చిన వారు వాళ్ల వారసుల్లా పనిచేస్తున్నారని   ఆయన అన్నారు. తెలంగాణ పాలకులు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం నడుచుకోవడం లేదన్నారు ఈ మాట అన్నాక ఆయన మరొక ప్రకటన చేశారు. . క్షేత్రస్థాయిలో పరిస్థితులు తెలుసుకోవడానికి త్వరలోనే విద్యాయాత్ర చేపడుతామని కోదండరాం ప్రకటించారు. యాత్రల వల్లే కోదండరామ్ మీద ప్రభుత్వం కుత కుత వుడుకూ ఉంది. 

 

ఇపుడు ఈ పాలకులు కూడా  కెసిఆర్ కూడా ఆంధ్రోళ్ల  వారసత్వం పుచ్చుకున్నారని   వూరూర చెప్పేందుకు ఆయన ఈ యాత్రను వాడుకుంటారు.  కెసిఆర్,టిఆర్ ఎస్ రియక్షన్ ఎలా ఉంటుందో వేచి చూద్దాం.

 

 

Follow Us:
Download App:
  • android
  • ios