కాంగ్రెస్ జాబితాపై బీసీల మండిపాటు, బంద్‌కు పిలుపు: ఆర్. కృష్ణయ్య

కాంగ్రెస్ పార్టీలో బీసీ అభ్యర్థులకు అన్యాయం జరిగిందని బీసీ సంక్షేమ సంఘం  జాతీయాధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ఆరోపించారు

BC welfare president krishnaiah called bandhi on nov 17

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో బీసీ అభ్యర్థులకు అన్యాయం జరిగిందని బీసీ సంక్షేమ సంఘం  జాతీయాధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ఆరోపించారు. బీసీలకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ ఈ నెల 17వ తేదీన తెలంగాణ బంద్‌కు పిలుపునిస్తున్నట్టు  ఆయన ప్రకటించారు.

కాంగ్రెస్ పార్టీ  సోమవారం రాత్రి 65 అభ్యర్థులను ప్రకటించింది.ఈ అభ్యర్థుల్లో కేవలం 13 మంది బీసీలకు మాత్రమే టికెట్లు కేటాయించారు.   బీసీలకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని  ఆర్. కృష్ణయ్య విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీలోని బీసీ అభ్యర్థులకు న్యాయం చేయాలని  ఆయన డిమాండ్ చేశారు.  బీసీలకు న్యాయం చేయాలని  ఆయన డిమాండ్ చేశారు.కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 65 స్థానాల్లో  కేవలం 13 మంది బీసీలకు మాత్రమే  టికెట్లు కేటాయించడంపై ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీ‌పై  ఒత్తిడి తెచ్చేందుకు గాను  ఈ నెల 17వ తేదీన తెలంగాణ బంద్‌ నిర్వహిస్తున్నట్టు ఆయన  ప్రకటించారు. మిగిలిన స్థానాల్లోనైనా బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
 

సంబంధిత వార్తలు

ఉత్తమ్ తో పాటు భార్యకూ టికెట్: కాంగ్రెసు తొలి జాబితా, అభ్యర్థులు వీరే

కంగు తిన్న పొన్నాల: హుటాహుటిన ఢిల్లీకి పయనం

పొన్నాలకు షాక్: జనగామ నుంచి కోదండరామ్ కే చాన్స్

కన్నీళ్లు పెట్టుకున్న పొన్నాల లక్ష్మయ్య

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios