తెలంగాణ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి, ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతిరెడ్డి తన నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రకు జనాలు భారీగా తరలివచ్చారు. కోదాడ నియోజకవర్గంలోని మోతె మండలంలో ఆమె పాదయాత్ర చేపట్టారు.

మోతె మండలానికి ఎత్తిపోతల పధకం సాధన కోసమే ప్రధాన ఎజెండాగా ఈ పాదయాత్ర చేపట్టినట్లు ఉత్తమ్ పద్మావతి ప్రకటించారు. మోతె మండలంలోని చెఱువులు, కుంటలను పాలేరు, యస్.ఆర్.యస్.పి జలాలతో నింపేందుకు వత్తిడి పెంచడంలో భాగంగా ఈ యాత్ర చేసినట్లు చెబుతున్నారు.

ఈ పాదయాత్రను సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు చేపట్టనున్నారు. యాత్రలో వేలాదిగా రైతులు, కార్యకర్తలు, అఖిలపక్షం నాయకులు,మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వీడియో కింద చూడొచ్చు.