హుజూర్‌నగర్: హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి ఎన్. పద్మావతి  ఓటమికి కోదాడ అసెంబ్లీ నియోజకవర్గం ప్రభావం కూడ ఉందని  స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

గత ఏడాది డిసెంబర్  7వ తేదీన  కోదాడ అసెంబ్లీ స్థానం నుండి  పద్మావతి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో ఈ స్థానం నుండి టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసిన  బొల్లం మల్లయ్య యాదవ్ విజయం సాధించారు.

read more   చెల్లని ఉత్తమ్ స్లోగన్, సైదిరెడ్డి బంధువుల "స్థానిక" బలం

అయితే కొన్ని పోలింగ్ స్టేషన్ల‌కు సంబంధించిన ఓట్లను లెక్కించకుండానే ఈ ఎన్నికల ఫలితాన్ని వెల్లడించారని కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి పద్మావతి కోర్టులో కేసు వేసింది. అయితే ఈ కేసు కోర్టులో నడుస్తోంది. ఈ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్ధి బొల్లం మల్లయ్య యాదవ్ స్వల్ప మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్ధి పద్మావతిపై విజయం సాధించారు.

కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి పద్మావతి కోదాడ అసెంబ్లీ స్థానం ఫలితంపై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానంలో ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసింది. అయితే ఈ ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ వర్గీయులు  కోదాడ అంశాన్ని తెరమీదికి తీసుకొచ్చారు.

కోదాడ అసెంబ్లీ ఎన్నికల ఫలితంపై కోర్టులో కేసున్నందున ఆ కేసు తేలితే పద్మావతి తిరిగి కోదాడ నియోజకవర్గానికి మారే అవకాశం ఉంటుందని ప్రచారం సాగింది.ఈ ప్రచారం కూడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి పద్మావతికి నష్టం కల్గించినట్టుగా విశ్లేషకులు భావిస్తున్నారు.

 ఉత్తమ్ పద్మావతి ఓటమికి కారణాలివీ

ఇదే అసెంబ్లీ నియోజకవర్గం నుండి 2009 నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా  ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధిస్తున్నారు. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబానికి  కంటే సైదిరెడ్డికి పట్టం కట్టాలని ఓటర్లు భావించి ఉంటారని  విశ్లేషకులు అభిప్రాయంతో ఉన్నారు.

ఇక గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో  కూడ కాంగ్రెస్ అభ్యర్ధి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధిగా శానంపూడి సైదిరెడ్డి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.

ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన ఉప ఎన్నికల్లో నల్గొండ నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించాడు. దీంతో ఉత్తమ్‌కుమార్ రెడ్డి హుజూర్‌నగర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడు. ఈ ఉప ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి  భార్య పద్మావతి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా బరిలోకి దిగారు.

  HuzurNagar Bypoll Result... కాంగ్రెస్ ఓటమికి కారణం ఇదేనా..?

హుజూర్ నగర్లో మాత్రం గత దఫా కన్నా పోలింగ్ శాతం అధికంగా నమోదవ్వడం విశేషం. ఈ పెరిగిన శాతం తమకంటే తమకు లాభం కలిగిస్తుందని ఇటు తెరాస, కాంగ్రెస్ లు తెగ వాదులాడుకుంటున్నాయి. ఇటు అధికార తెరాస, సిట్టింగ్ కాంగ్రెస్ ఇరు పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పోరు ఉత్కంఠంగా మారింది. ఒక రెఫరెండం మాదిరిగా ఈ ఎన్నికను అందరూ భావించడం వల్ల ప్రజలు భారీ సంఖ్యలో ఓట్లు వేశారు.