#Huzurnagar result: చెల్లని ఉత్తమ్ స్లోగన్, సైదిరెడ్డి బంధువుల "స్థానిక" బలం

టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ఆంధ్ర వ్యక్తి అంటూ తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన నివాదం చెల్లుబాటు కాలేదు. స్థానిక సంస్థల్లో సైదిరెడ్డి బంధువుర్గం విజయాలు టీఆర్ఎస్ కు కలిసి వచ్చాయి.

#Huzurnagar result: Shanampudi saidiReddy's relatives in Local bodies

హుజూర్ నగర్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఆంధ్ర వ్యక్తిని హుజూర్ నగర్ శాసనసభ ఉప ఎన్నికల్లో దించిందనే తెలంగాణ పిసిసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నినాదం చెల్లుబాటు కాలేదు. శానంపూడి సైదిరెడ్డి స్థానికుడు కాదనే వాదన ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి, కాంగ్రెసు పార్టీ అభ్యర్థి పద్మావతికి ఏ మాత్రం కలిసి రానట్లే కనిపిస్తోంది. 

హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని గుండ్లపల్లి గ్రామానికి చెందన శానంపూడి సైదిరెడ్డికి బంధువర్గం గణనీయంగా ఉంది. శ్తానిక సంస్థల్లో సైదిరెడ్డి బంధువులు పలు చోట్ల గెలిచారు. మఠంపల్లి మండలంలోని పెదవీడు 2 ఎంపిటీసీగా గెలిచిన కుందూరు వెంకటరెడ్డి సైదిరెడ్డి చిన్నమ్మ కుమారుడు. మఠంపల్లి మండల కేంద్రం సర్పంచ్ మన్నెం శ్రీనివాస రెడ్డి ఆయనకు మేనమామ. మఠంపల్లి మండలంలోని రఘునాథపాలెం జడ్పీటీసీ బ్రహ్మారెడ్డి సైదిరెడ్డి సమీప బంధువు.

read more Huzurnagar Election Result :హుజూర్‌నగర్‌ ఫలితం.. టీఆర్ఎస్ జోరు

ఇక, చింతలపాలెం జడ్పీటీసీ చింతారెడ్డి చంద్రకళ సైదిరెడ్డికి స్వయాన సోదరి. చింతలపాలెం 1 ఎంపీటీసీ చింతారెడ్డి సైదిరెడ్డి ఆయనకు స్వయాన బావ. మిగతా పలు చోట్ల ఆయనకు అత్యంత సన్నిహితులైనవారే గెలిచారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ అత్యధిక స్థానాలను గెలుచుకున్న విషయం కూడా తెలిసిందే.

ఇదిలావుంటే, సాధారణ ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఓటమి పాలైన తర్వాత కూడా సైదిరెడ్డి నిత్యం ప్రజల మధ్యనే ఉన్నారు. నియోజకవర్గంలోని మెజారిటీ గ్రామాలకు వెళ్లి ప్రజలను కదిలిస్తూ వచ్చారు. అక్కడే ఉత్తమ్ కుమార్ రెడ్డి విఫలమయ్యారు. దానికితోడు, అధికారంలో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకోవడం వల్ల పనులు జరుగుతాయనే విషయాన్ని టీఆర్ఎస్ నాయకులు ప్రజల్లోకి తీసుకుని వెళ్లారు. ఈ నెల 21వ తేదీన హుజూర్ నగర్ అసెంబ్లీ స్తానానికి పోలింగ్ జరిగింది. గురువారం ఓట్ల లెక్కింపు జరిగింది. 

 Huzurnagar Bypoll Results 2019: ఉత్తమ్ పద్మావతి ఓటమికి కారణాలివీ

వివిధ పార్టీలకు పోలైన ఓట్లు...

మొదటి రౌండ్
టిఆర్ఎస్ -5583
కాంగ్రెస్-3107
బిజెపి-128
టిడిపి-113
టిఆర్ఎస్ లీడ్- 2476

రెండవ రౌండ్
టిఆర్ఎస్ -4723
కాంగ్రెస్-2851
బిజెపి-170
టిడిపి-69
టిఆర్ఎస్ లీడ్- 1872
రెండవ రౌండ్ ముగిసే సరికి టిఆర్ఎస్ లీడ్-4348

మూడవ రౌండ్
టిఆర్ఎస్ -5089
కాంగ్రెస్-2540
బిజెపి-114
టిడిపి-86
టిఆర్ఎస్ లీడ్- 2549
మూడవ రౌండ్ ముగిసే సరికి టిఆర్ఎస్ లీడ్-6897

 HuzurNagar Bypoll Result... కాంగ్రెస్ ఓటమికి కారణం ఇదేనా..

నాల్గవ రౌండ్
టిఆర్ఎస్ -5144
కాంగ్రెస్-3961
బిజెపి-102
టిడిపి-127
టిఆర్ఎస్ లీడ్- 1183
నాల్గవ రౌండ్ ముగిసే సరికి టిఆర్ఎస్ లీడ్-8080

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios