హుజూర్ నగర్ ఉప ఎన్నికకు గురువారం ఉదయం నుంచి కౌంటింగ్ జరుగుతోంది. కాగా... కౌంటింగ్ ఇంకా పూర్తి కానప్పటికీ.... ఇప్పటి వరకు టీఆర్ఎస్ అభ్యర్థి ముందంజలో దూసుకుపోతున్నారు. దీంతో.... టీఆర్ఎస్ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పనిలో పనిగా.. కాంగ్రెస్ నేతలపై విమర్శలు కూడా చేస్తున్నారు.

ఈ ఎన్నికతో తెలంగాణ లో కాంగ్రెస్ పని అయిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఆర్టీసీ సమ్మె నడుస్తోంది. ఈ ప్రభావం హుజూర్ ఎన్నికపై చూపిస్తుందని... టీఆర్ఎస్ ఓడిపోయే అవకాశం ఉందని అందరూ భావించారు. అయితే.. ఫలితాలు చూస్తుంటే అసలు సమ్మె ప్రభావం కనిపించినట్లు కూడా అనిపించడం లేదు.

రౌండ్ రౌండ్ కీ టీఆర్ఎస్ అభ్యర్థి ముందుంజలో దూసుకుపోతున్నారు. ప్రస్తుతానికి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి 25వేల మెజార్టీతో ముందంజలో ఉన్నారు. దీంతో కాంగ్రెస్ నేతలు డీలా పడిపోయారు. తమ ఓటమి కారణమేమిటనే విశ్లేషణలో పడిపోయారు. 

read more  Huzurnagar Bypoll Results 2019: ఉత్తమ్ పద్మావతి ఓటమికి కారణాలివీ

ఎన్నికల షెడ్యూల్ మొదలుకుని పోలింగ్ వరకూ... ఇలా మొత్తం ఎలక్షనీరింగ్ లో కాంగ్రెస్ విఫలమైందా అదే కొంపముంచిందా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. అయితే గ్రూపు గొడవలు మరోసారి కాంగ్రెస్ ని దెబ్బతీశాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరీ ముఖ్యంగా ఆర్టీసీ సమ్మె, టీఆర్ఎస్ సర్కార్ పై విమర్శలను క్యాష్ చేసుకోవడంలో కాంగ్రెస్ నేతలు విఫలమయ్యారని సొంత పార్టీ నేతలే చెప్పడం విశేషం.

ఇవన్నీ కాకుండా..టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ సిట్టింగ్ స్థానాన్ని  చేజార్చుకోవడంపై కూడా కాంగ్రెస్ నేతల్లో అంతర్మథనం మొదలైందనే వాదనలు వినపడుతున్నాయి. మరి ఈ ఓటమిపై కాంగ్రెస్ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

read more  Huzurnagar Election Result :హుజూర్‌నగర్‌ ఫలితం.. టీఆర్ఎస్ జోరు

తెలంగాణ ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న హుజూర్‌నగర్ ఉపఎన్నికలో విజేత ఎవరో మరికొద్దిగంటల్లో తేలిపోనుంది. గురువారం ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది.

సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మొత్తం 22 రౌండ్లలో ఓట్లను లెక్కించేందుకు గాను 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు.

read more    #Huzurnagar result: చెల్లని ఉత్తమ్ స్లోగన్, సైదిరెడ్డి బంధువుల "స్థానిక" బలం

ప్రతీ పది నిమిషాలకు ఒక్క రౌండ్ ఫలితం వెలువడే అవకాశం ఉంది.  నియోజకవర్గంలో మొత్తం పోలైన ఓట్లు 2 లక్షల 751. మండలానికి 5 పోలింగ్ కేంద్రాల చొప్పున వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు చేపడతారు

పది గంటల కల్లా ట్రెండింగ్స్ తెలుస్తాయని.. 2 గంటల కల్లా ఫలితం వెలువడుతుందని అధికారులు తెలిపారు. నియోజకవర్గంలోని 302 పోలింగ్ కేంద్రాల్లో 84.75 పోలింగ్ శాతం నమోదైంది.గత దఫా కన్నా పోలింగ్ శాతం అధికంగా నమోదవ్వడం విశేషం.

ఈ పెరిగిన శాతం తమకంటే తమకు లాభం కలిగిస్తుందని ఇటు టీఆర్ఎస్,  కాంగ్రెస్ లు తెగ వాదులాడుకుంటున్నాయి. ఇటు అధికార టీఆర్ఎస్, సిట్టింగ్ కాంగ్రెస్ ఇరు పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పోరు ఉత్కంఠంగా మారింది. ఒక రెఫరెండం మాదిరిగా ఈ ఎన్నికను అందరూ భావించడం వల్ల ప్రజలు భారీ సంఖ్యలో ఓట్లు వేశారు.