Huzurnagar Bypoll Results 2019: ఉత్తమ్ పద్మావతి ఓటమికి కారణాలివీ

హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి పద్మావతి ఓటమి పాలు కావడానికి పలు కారణాలను రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకి గ్రూపు తగాదాలతో పాటు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిని గెలిపిస్తే ఏం ప్రయోజనమనే అభిప్రాయం కూడ టీఆర్ఎస్ కు కలిసి వచ్చిందనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.

TRS Saidi Reddy Win:Why Congress Candidate Padmavathi Defeat In Huzurnagar Bypoll

హుజూర్‌నగర్: హుజూర్‌నగర్  అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో  టీఆర్ఎస్  అభ్యర్ధి శానంపూడి సైదిరెడ్డి విజయం సాధించడానికి అనేక కారణాలు ఉన్నాయి. గత ఏడాది సాధారణ ఎన్నికల్లో  హుజూర్‌నగర్  అసెంబ్లీ స్థానం నుండి  కాంగ్రెస్ అభ్యర్ధి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. ఈ దఫా ఆయన భార్య పద్మావతి బరిలోకి దిగారు. అయితే హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఓటర్లు మాత్రం టీఆర్ఎస్ అభ్యర్ధి శానంపూడి సైదిరెడ్డికి మాత్రమే పట్టం కట్టారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2009 అసెంబ్లీ ఎన్నికలకు ముందు నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. ఈ సమయంలో హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానం ఏర్పాటైంది. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కోదాడ నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ అభ్యర్ధిగా విజయం సాధించారు.2009 నుండి 2018 వరకు ఈ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్ధిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి శానంపూడి సైదిరెడ్డి ఓటమి పాలయ్యాడు.

read  more   HuzurNagar Bypoll Result... కాంగ్రెస్ ఓటమికి కారణం ఇదేనా..

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత టీఆర్ఎస్ అభ్యర్ధి శానంపూడి సైదిరెడ్డి నియోజకవర్గంలోనే ఉన్నారు. నియోజకవర్గంలోనే పలు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేశారు.

రాష్ట్రంలో టీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వచ్చింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే టీపీసీసీ చీఫ్‌గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం అవుతారని ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ చేసిన ప్రచారం కూడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలుపుకు దోహదపడినట్టుగా టీఆర్ఎస్ నాయకత్వం అభిప్రాయంతో ఉంది. 

మరో వైపు కారు గుర్తును పోలిన రోడ్డు రోలర్ గుర్తుకు ఎక్కువ  ఓట్లు రావడంతో టీఆర్ఎస్ అభ్యర్ధి శానంపూడి సైదిరెడ్డికి ప్రధాన కారణమైందని ఆ పార్టీ  నాయకత్వం గుర్తించింది. కారు గుర్తును పోలిన రోడ్డు రోలర్ పోలిన గుర్తును కేటాయించకూడదని టీఆర్ఎస్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడ కోరింది.

read more  Huzurnagar Election Result :హుజూర్‌నగర్‌ ఫలితం.. టీఆర్ఎస్ జోరు

ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి హుజూర్‌నగర్ నుండి పోటీ చేసినా కూడ పెద్దగా ప్రయోజనం ఉండదని నియోజకవర్గ ఓటర్లు భావించి ఉండొచ్చు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలో ఉంది. అధికారంలో ఉన్న పార్టీకి చెందిన  అభ్యర్ధిని గెలిపిస్తేనే హుజూర్‌నగర్ నియోజకవర్గం అభివృద్ధి సాధించుకొనే అవకాశం ఉంటుందని  ఓటర్లు భావించి ఉంటారని  రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

గత ఎన్నికల్లో హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని నేరేడుచర్ల మండలంలో కాంగ్రెస్ అభ్యర్ధి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆధిక్యత వచ్చింది. కానీ, ఈ దఫా అదే మండలంలో కాంగ్రెస్ అభ్యర్ధి పద్మావతికి మాత్రం ఈ మండలంలో  మాత్రం ఈ దఫా టీఆర్ఎస్‌ లీడ్ దక్కించుకొంది.

గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ, తెలంగాణ జనసమితి ప్రజా కూటమి (మహాకూటమి) గా ఏర్పడి పోటీ చేశాయి .  ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఈ పార్టీలన్నీ మద్దతుగా నిలిచాయి.

read more Huzurnagar Result: పద్మావతిపై కోదాడ కేసు ఎఫెక్ట్, అదేమిటి....

ఈ ఉప ఎన్నికల్లో సీపీఐ తొలుత టీఆర్ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డికి మద్దతు ప్రకటించారు. ఆ తర్వాత ఆర్టీసీ సమ్మె విషయంలో  సీఎం కేసీఆర్ వైఖరిని నిరసిస్తూ టీఆర్ఎస్ అభ్యర్ధికి  మద్దతును సీపీఐ ఉప సంహరించుకొంది. ఈ స్థానంలో ఆ పార్టీ ఎవరికి మద్దతును ప్రకటించలేదు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కాంగ్రెస్ అభ్యర్ధికి మద్దతు ప్రకటించింది. పార్లమెంట్ ఎన్నికల్లో  కూడ టీడీపీ కాంగ్రెస్ పార్టికి మద్దతును ప్రకటించింది. 2014 ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసింది. ఈ  స్ధానం నుండి ఆ ఎన్నికల్లో పోటీ చేసిన వంగాల స్వామిగౌడ్ సుమారు 20 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. అదే  ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ  అభ్యర్ధి గట్టు శ్రీకాంత్ రెడ్డి పోటీ చేశాడు.ఆ ఎన్నికల్లో గట్టు శ్రీకాంత్ రెడ్డికి కూడ 20 వేలకు పైగా ఓట్లు వచ్చాయి.

హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డికి వైసీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి మద్దతును ప్రకటించారు. ఈ పరిణామం కూడ టీఆర్ఎస్ కు కలిసి వచ్చిందని  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఈ పరిణామం రాజకీయంగా టీఆర్ఎస్ అభ్యర్ధికి పోల్ మేనేజ్‌మెంట్‌లో కలిసి వచ్చిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అంతేకాదు రైతు బంధు పథకానికి సంబంధించిన సంక్షేమ పథకాల డబ్బులను కూడ ఎన్నికలకు ముందే ఈ నియోజకవర్గంలోని లబ్దిదారులకు అందించారు.  ఇది కూడ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు అనుకూలమైన ఫలితం వచ్చేలా  చేసిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. 

హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపిక విషయంలో  ఆ పార్టీ నేతల మధ్య విభేదాలు కూడ ఆ పార్టీకి నష్టం కల్గించింది. హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి ఉత్తమ్ ‌కుమార్ రెడ్డి భార్య పద్మావతిని బరిలోకి దింపడాన్ని కాంగ్రెస్ పార్టీలోని వర్గం ప్రశ్నించింది.

కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి  పద్మావతిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా బరిలోకి దింపటాన్ని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు ఈ ఎన్నికల్లో చామల కిరణ్ కుమార్ రెడ్డిని బరిలోకి దింపాలని  రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కానీ  రేవంత్ రెడ్డి డిమాండ్ ను కాదని  కూడ ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతికి  కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు కేటాయించింది. 

ఈ అసెంబ్లీ స్థానంలో  కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి పద్మావతి తరపున రేవంత్ రెడ్డి ఈ నెల 18, 19 తేదీల్లో ప్రచారం నిర్వహించారు. నిజామాబాద్ లో తన స్వంత చెల్లి కవితను కేటీఆర్ గెలిపించుకోలేకపోయారు, కానీ నా అక్క పద్మావతిని హుజూర్‌నగర్ లో గెలిపించుకొంటానని రేవంత్ రెడ్డి ప్రకటించారు. కానీ, ఫలితం మాత్రం భిన్నంగా వచ్చింది.


2009 ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానం నుండి తొలిసారి పోటీ చేశారు. ఆ సమయంలో  ఈ స్థానం నుండి  టీఆర్ఎస్ అభ్యర్ధిగా గుంతకండ్ల జగదీష్ రెడ్డి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.

ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలోనే హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరిగాయి.ఈ ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధిగా తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకొన్న శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ పోటీ చేసింది. అయితే ఈ ఎన్నికల్లో శంకరమ్మ ఓటమి పాలైంది. హుజూర్‌నగర్ ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్ధి  ఉత్తమ్ కుమార్ రెడ్డికి పట్టం కట్టారు.

ఇక గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో  కూడ కాంగ్రెస్ అభ్యర్ధి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధిగా శానంపూడి సైదిరెడ్డి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.

ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన ఉప ఎన్నికల్లో నల్గొండ నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించాడు. దీంతో ఉత్తమ్‌కుమార్ రెడ్డి హుజూర్‌నగర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడు. ఈ ఉప ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి  భార్య పద్మావతి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా బరిలోకి దిగారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios