కేసీఆర్ ను కాపాడుతున్నది కిషన్ రెడ్డి - మంత్రి పొన్నం ప్రభాకర్
ponnam prabhakar : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ బినామీ అని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎంలు ఒక్కటే అని అన్నారు. మంగళవారం సచివాలయంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ponnam prabhakar : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ను కాపాడుతున్నది బీజేపీ, ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. మంగళవారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ఇంత వరకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మేడిగడ్డ పై ఎందుకు విచారణ జరపలేదని అన్నారు. కిషన్ రెడ్డి కేసీఆర్ బినామీ అని తీవ్ర ఆరోపణలు చేశారు.
మణిపూర్ భద్రతా దళాలపై దాడి వెనుక విదేశీ కిరాయి దళాల హస్తం - ఎన్ బీరెన్ సింగ్
మేడిగడ్డపై కేంద్రం సీబీఐ విచారణ జరపకపోవడాన్ని పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కిషన్ రెడ్డి కాపాడుతున్నారని ఆరోపించారు. ఇప్పుడు సీబీఐ విచారణ జరపాలని కిషన్ రెడ్డి కోరుతున్నారని, దీనిని బట్టి చూస్తే కేసీఆర్ ను ఆయన కాపాడుతున్నట్టు స్పష్టమవుతోందని ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎంలు ఒక్కటే అని విమర్శలు చేశారు.
భూకంపంతో జపాన్ అతలాకుతలం.. 30 మంది మృతి, 45 వేల ఇళ్లకు నిలిచిన విద్యుత్ సరఫరా..
ఇప్పటికైనా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. బీఆర్ఎస్ పాలనపై విచారణ జరిపించాలని కేంద్రానికి లేఖ రాయాలని పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. రాష్ట్రానికి కేంద్రం నిధులు తీసుకురాలేదని, సొంత రాష్ట్రంపై కిషన్ రెడ్డికి ఆసక్తి లేదని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ కు వ్యక్తిగత ఏటీఎంగా బీజేపీ నేతలు విమర్శిస్తున్నారని, కానీ ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత ప్రమేయంపై ఏమీ చేయడం లేదని విమర్శించారు.
ట్రక్కు డ్రైవర్ల దేశ వ్యాప్త నిరసనపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం..
అనంతరం ఆయన అభయ హస్తం ప్రజాపాలన దరఖాస్తుల అంశంపై మాట్లాడారు. ఈ నెల 6వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని చెప్పారు. ప్రభుత్వమే ఈ దరఖాస్తు ఫారమ్ ఇస్తుందని, ఎవరూ కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని అన్నారు. జనవరి 6వ తేదీ వరకు మాత్రమే వాటిని స్వీకరిస్తామని, పొడగింపు లేదని అన్నారు. కాగా.. ఇదే అంశంపై ఇటీవల రేవంత్ రెడ్డి మాట్లాడారు. జనవరి 6వ తేదీ దాటిన తరువాత కూడా మండల కార్యాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. కానీ పొన్నం ప్రభాకర్ దానికి విరుద్ధంగా మాట్లాడారు.