Asianet News TeluguAsianet News Telugu

ఆదిభట్లలో యువతి కిడ్నాప్ కేసు.. రోడ్డుపై బాధితురాలి కుటుంబ సభ్యుల ధర్నా, సీఐపై ఆరోపణలు

రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో వైశాలి అనే డెంటల్ డాక్టర్ కిడ్నాప్ అయిన వ్యవహారం కలకలం రేపుతోంది. ఈ క్రమంలో బాధితురాలి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. సీఐ నరేంద్రను సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 

kidnapped dental doctor vyshali family protest in adibatla
Author
First Published Dec 9, 2022, 5:05 PM IST

రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో వైశాలి అనే డెంటల్ డాక్టర్ కిడ్నాప్ అయిన వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. దాదాపు 100 మంది రౌడీలతో కలిసి నవీన్ రెడ్డి అనే వ్యక్తి ఆమె ఇంటిపై దాడి చేసి కిడ్నాప్‌కు పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో సాగర్ రోడ్డుకు ఇరువైపులా బైఠాయించారు వైశాలి కుటుంబ సభ్యులు. వైశాలిని కాపాడాలంటూ వారు నినాదాలు చేశారు. ఆదిభట్ల సీఐ నరేందర్‌ను సస్పెండ్ చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. 

మరోవైపు.. తన కుమార్తెను మిస్టర్ టీ ఓనర్ నవీన్ రెడ్డి కిడ్నాప్ చేశాడంటూ వైశాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కూతురు కిడ్నాప్‌కు ఆదిభట్ల సీఐ నరేంద్ర నిర్లక్ష్యమే కారణమని యువతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దాడి సమయంలో 100కి కాల్ చేసినా ఎవ్వరూ స్పందించలేదని అమ్మాయి బంధువులు అంటున్నారు. దీనిపై రంగంలోకి దిగిన పోలీసులు కిడ్నాపర్ల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు  చర్యలు చేపట్టారు. 

ALso REad:ఆదిభట్లలో యువతి కిడ్నాప్.. 100 మంది రౌడీలతో సినీ ఫక్కీలో దాడి, సామాన్లు ధ్వంసం

తుర్కయాంజల్ మున్సిపాలిటీ మన్నెగూడలోని సిరి టౌన్‌షిప్‌లో సంఘటన జరిగింది. ముచ్చర్ల దామోదర్ రెడ్డి.. నిర్మల దంపతుల కుమార్తె వైశాలి డెంటల్ డాక్టర్‌గా పనిచేస్తున్నారు. అమ్మాయి ఇంటిపై దాదాపుగా 100 మందికి పైగా యువకులతో దాడికి దిగాడు నవీన్ రెడ్డి. ఇంట్లోని సీసీ కెమెరాలు, సామాన్లు పూర్తిగా ధ్వంసం చేశారు. అమ్మాయి తల్లిదండ్రులతో పాటు బంధువులపైనా దాడి చేశారు. 

తమ కూతురిని పెళ్లి చేసుకుంటానని నవీన్ రెడ్డి చెప్పాడని, అతనితో మాట్లాడిన తర్వాత తాము పెళ్లికి అంగీకరించలేదని వైశాలి తల్లి అంటున్నారు. వైశాలి నిశ్చితార్థం జరిగే సమయంలో యువకులు దాడి చేశారు. దాడి చేసినవారిలో కొందరు హెల్మెట్లు ధరించి ఉన్నారని, కర్రలు తీసుకుని వచ్చారని చెబుతున్నారు. తనను తాకవద్దని వైశాలి చెప్పినా యువకులు వినలేదని ఆమె తల్లి చెప్పారు

Follow Us:
Download App:
  • android
  • ios