తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నా టీఆర్ఎస్ అధినాయకత్వం పెండింగ్ లో పెట్టిన స్థానాలకు అభ్యర్థులను ఇంకా ఖరారు చేయలేదు. దీంతో ఆయా స్థానాల్లో టికెట్లు ఆశిస్తున్న నాయకులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇలా ఖైరతాబాద్ టికెట్ తనకే వస్తుందని ఇన్నాళ్లు ఎదురు చూసిన మన్నె గోవర్ధన్ రెడ్డి ఇవాళ తెలంగాణ భవన్ ముందు ఆందోళన చేపట్టి పోలీసుల లాఠీచార్జిలో గాయపడిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మన్నె గోవర్ధన్ గుండెపోటుకు గురైనట్లు సమాచారం. దీంతో అతడిని డాక్టర్లు ఐసియూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతడికి మెరుగైన చికిత్స అందిస్తున్నామని...మరికొంత సమయం గడిస్తేగాని ఆరోగ్య పరిస్థితి గురించి పూర్తి వివరాలు చెప్పలేమని డాక్టర్లు వెల్లడించారు. 

ఖైరతాబాద్ టికెట్ విషయంలో ఇప్పటివరకు సహనం వహించిన మన్నె గోవర్దన్‌రెడ్డి ఇవాళ ఆందోళనకు దిగారు. తన అనుచరులు, కార్యకర్తలతో కలిసి తెలంగాణ భవన్ ముట్టడికి ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళన చేపడుతున్న వారిని పోలీసులు నిలువరించడానికి ప్రయత్నించడంతో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. దీంతో పోలీసులు ఆందోళనకారులపై లాఠీచార్జ్ చేశారు. దీంతో గోవర్థన్ రెడ్డితో పాటు పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి.  

వీడియో
"

 

మరిన్ని వార్తలు

తెలంగాణ భవన్ వద్ద లాఠీచార్జ్... మన్నె గోవర్థన్ రెడ్డికి గాయాలు (వీడియో)

తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత...దానంకు వ్యతిరేకంగా నిరసన(వీడియో)