తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థులకు ప్రకటించి భీపారాలను కూడా పంపిణీ చేసింది. మొదటి అభ్యర్థల జాబితా ప్రకటించి నెల రోజులకు మించి సమయం గడిచినా మిగిలిన స్థానాలకు మాత్రం ఇంకా అభ్యర్థుల ఎంపిక జరగలేదు. దీంతో అభ్యర్థులతో పాటు వారి అనుచరుల్లో అసహనం ఎక్కువవుతోంది. 

టికెట్ కోసం పోటీ ఎక్కువగా వున్న నియోజకవర్గాల్లోనే ఈ సీట్ల పంపకం మిగిలివుంది. అంతేకాకుండా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడి నామినేషన్లకు చాలా తక్కువ సమయం మిగిలివుండటంతో అభ్యర్థులు, వారి అనుచరులు, కార్యకర్తలు తమ అసహనాన్ని అధినాయకత్వం ముందు  ప్రదర్శించి తాడో పేడో తేల్చుకునే పనిలో పడ్డారు. ఇలా ఖైరతాబాద్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇంచార్జి మన్నె గోవర్థన్ రెడ్డి అనుచరులు ఏకంగా తెలంగాణ భవన్ వద్ద నిరసనకు దిగారు.

 తమ నాయకుడు గోవర్దన్ రెడ్డికే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బంజారాహిల్స్ లోని టీఆర్ఎస్ కార్యాలయానికి భారీగా చేరుకున్న కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. కొత్తగా పార్టీలో చేరిన దానం నాగేందర్ కు టికెట్ ఇస్తే పార్టీ ఓటమిపాలవడం ఖాయమని... కాబట్టి ప్రజా నాయకుడు గోవర్దన్ రెడ్డి టికెట్ ఇవ్వాలంటూ నిరసన కొనసాగిస్తున్నారు. 

వీడియో

"