ఖైరతాబాద్ పేరును గణేష్‌పురిగా మార్చాలి : హైద‌రాబాద్ బీజేపీ నాయ‌కుడు

Khairatabad: హైద‌రాబాద్ న‌గ‌రంలోని ఖైరతాబాద్ పేరును గణేష్‌పురిగా మార్చాలని ఒక‌ బీజేపీ నేత అన్నారు. తెలంగాణలో స్థలాల పేరు మార్చాలని బీజేపీ నేత ప్రతిపాదించడం ఇదే తొలిసారి కాదు. గతంలో హైదరాబాద్, నిజామాబాద్ పేర్లను కూడా మారుస్తామని కాషాయ పార్టీ సీనియర్ నేతలు శపథం చేశారు.
 

Khairatabad should be renamed as Ganeshpuri: Bjp leader in Hyderabad  RMA

Telangana BJP: హైద‌రాబాద్ న‌గ‌రంలోని  ఖైరతాబాద్ పేరును గణేష్‌పురిగా మార్చాలని ఒక‌ బీజేపీ నేత అన్నారు. తెలంగాణలో స్థలాల పేరు మార్చాలని బీజేపీ నేత ప్రతిపాదించడం ఇదే తొలిసారి కాదు. గతంలో హైదరాబాద్, నిజామాబాద్ పేర్లను కూడా మారుస్తామని కాషాయ పార్టీ సీనియర్ నేతలు శపథం చేశారు.

వివ‌రాల్లోకెళ్తే.. న‌గ‌రంలోని ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి హిందూ దేవుడు గణేష్ పేరును 'గణేష్‌పురి'గా మార్చాలని తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి ఎన్‌వీ సుభాష్ ఆగస్టు 30 బుధవారం ప్రతిపాదించారు. గణేష్ చతుర్థి సందర్భంగా నియోజకవర్గంలో జరిగిన భాగ్యనగర్ ఉత్సవ్ కమిటీ సమావేశంలో బుధవారం బీజేపీ నాయకులు పాల్గొన్నారు. 

“ ఖైరతాబాద్ నియోజకవర్గంలోని భాగ్యనగర్ ఉత్సవ్ కమిటీ సమావేశంలో.. మేము ఉత్సవానికి చేరుకున్నాము. 'గణేష్‌పురి అసెంబ్లీ నియోజకవర్గం'గా పేరు మార్చాలనే ప్రతిపాదనకు నేను గట్టిగా మ‌ద్ద‌తుగా నిలుస్తున్నాను. మన ప్రాంతాలు మన సంప్రదాయాల సారాంశంతో ప్రతిధ్వనించనివ్వండి..” అని ఆయన ఎక్స్‌లో పోస్ట్‌లో పేర్కొన్నారు.

కాగా, చరిత్ర ప్రకారం ఖైరతాబాద్ పేరు ఖైరతీ బేగం పేరు మీదుగా ఈ ప్రాంతానికి పెట్టారు. ఆమె  ఇబ్రహీం కులీ కుతుబ్ షా (1550-1580) కుమార్తె, హుస్సేన్ షా వలీ భార్య. ఖైరతీ బేగం సమాధి, మసీదు తెలంగాణ హెరిటేజ్ శాఖ వెబ్‌సైట్‌లో రాష్ట్రంలోని 'ఐకానిక్ స్మారక చిహ్నాలలో' ఒకటిగా జాబితా చేయబడ్డాయి. అలాగే, ఈ ప్రాంతంలోని ఖైరతాబాద్ మసీదు కుతుబ్ షాహీ శకం శిల్పకళకు ప్ర‌సిద్ది. ఆరవ కుతుబ్ షాహీ రాజు సుల్తాన్ ముహమ్మద్ కుతుబ్ షా (1612-1626) కుమార్తె ఖైరతున్నీసా బేగం పేరు పెట్టబడింది. 

ఖైరతున్నీసా తన గురువు అఖుంద్ ముల్లా అబ్దుల్ మాలిక్ జ్ఞాపకార్థం మసీదును నిర్మించింది. తెలంగాణలో స్థలాల పేరు మార్చాలని బీజేపీ నేత ప్రతిపాదించడం ఇదే తొలిసారి కాదు. గతంలో హైదరాబాద్, నిజామాబాద్ పేర్లను కూడా మారుస్తామని కాషాయ పార్టీ సీనియర్ నేతలు శపథం చేశారు. 2023 చివరిలో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ అధికార ప్రతినిధి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios