Asianet News TeluguAsianet News Telugu

ప్రగతి నివేదన సభ: రెండు గంటల పాటు ప్రసంగించనున్న కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్  ప్రగతి నివేదన సభలో  సుమారు  గంటన్నర పాటు ప్రసంగించే అవకాశం ఉంది. నాలుగున్నర ఏళ్లలో తెలంగాణలో తమ ప్రభుత్వం ఏం చేసిందనే విషయాన్ని కేసీఆర్ తన ప్రసంగంలో వివరించనున్నారు.

KCR will speech around two hours in pragathi nivedhana sabha
Author
Hyderabad, First Published Sep 2, 2018, 3:42 PM IST


హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్  ప్రగతి నివేదన సభలో  సుమారు  గంటన్నర పాటు ప్రసంగించే అవకాశం ఉంది. నాలుగున్నర ఏళ్లలో తెలంగాణలో తమ ప్రభుత్వం ఏం చేసిందనే విషయాన్ని కేసీఆర్ తన ప్రసంగంలో వివరించనున్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొన్న సంక్షేమ కార్యక్రమాలను దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడ ఆదర్శంగా తీసుకొంటున్న విషయాన్ని  పలు సందర్భాల్లో సీఎం సహా పలువురు మంత్రులు గుర్తు చేస్తుంటారు.

అయితే  తమ ప్రభుత్వం ఏ రకమైన కార్యక్రమాలను చేపట్టింది.. ఎన్ని వర్గాల ప్రజలకు  న్యాయం  చేశామనే విషయమై  సీఎం తన ప్రసంగంలో వివరించే అవకాశం ఉంది. మరో వైపు  విపక్షాలకు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి  కేసీఆర్ ఈ సభ ద్వారా  సవాల్ విసిరే అవకాశం లేకపోలేదు.

ప్రగతి నివేదన సభా వేదికపై సుమారు 270 మంది ప్రజా ప్రతినిధులు కూర్చొనేలా  ఏర్పాట్లు చేశారు. సభా ప్రాంగణం వద్ద మెడికల్ క్యాంపును కూడ ఏర్పాటు చేశారు.మెడికల్ క్యాంప్ లో అత్యవసర చికిత్సను అందించేలా ఏర్పాట్లు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ హెలికాప్టర్ ద్వారా బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుండి  ప్రగతి భవన్  వేదికకు చేరుకొనే అవకాశం ఉంది.

ఈ వార్తలు చదవండి

ప్రగతి నివేదన సభ: రెండు గంటల పాటు ప్రసంగించనున్న కేసీఆర్

త్వరలో మరోసారి తెలంగాణ కేబినెట్ కీలక భేటీ, అసెంబ్లీ రద్దుపైనే చర్చ?

అర్చకుల వయో పరిమితి 65 ఏళ్లకు పెంపు: తెలంగాణ కేబినెట్ నిర్ణయం

అసెంబ్లీ రద్దుపై తుది నిర్ణయం కేసీఆర్ దే: ఎంపీ కవిత

Follow Us:
Download App:
  • android
  • ios