హైదరాబాద్: కరోనా వైరస్ కు సంబంధించి ఇష్టం వచ్చినట్లు వార్తలు రాస్తే సహించేది లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మీడియాను హెచ్చరించారు. ఎక్కడెక్కడో కరోనావైరస్ సోకినట్లు వార్తలు ప్రసారం చేస్తున్నారని, అటువంటి వార్తలను సహించేది లేదని ఆయన అన్నారు. ఆరోగ్య శాఖ నిర్ధారించిన కేసులను మాత్రమే వార్తలుగా రాయాలని, వినకుండా వార్తలు రాస్తామంటే సహించేది లేదని, కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. 

మంత్రివర్గ సమావేశానంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ముందు జాగ్రత్తగా తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు. కరోనా వైరస్ కట్టడికి రూ.500 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆయన తెలిపారు. అన్ని రకాల విద్యాసంస్థలను మార్చి 31వ తేదీ వరకు మూసేస్తున్నట్లు తెలిపారు. 

Also Read: యథావిధిగా పరీక్షలు: తెలంగాణలో బడులు, థియేటర్లు, మాల్స్ బంద్

పరీక్షలు మాత్రం యధాప్రకారం కొనసాగుతాయని ఆయన చెప్పారు. రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులకు హాస్టళ్లలో అన్ని సౌకర్యాలు ఉంటాయని, పరీక్షలు రాయని విద్యార్థులను పంపించివేస్తామని ఆయన చెప్పారు. 

మ్యారేజీ హాల్స్ కూడా మూసేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే నిర్ణయమైన వివాహాలు మాత్రం నిర్వహించుకోవచ్చునని, అయితే వివాహాలకు 200 మంది మాత్రమే హాజరు కావాలని ఆయన అన్నారు. ఆ తర్వాత వివాహాల కోసం హాల్స్ ను బుక్ చేసుకోవద్దని ఆయన చెప్పారు. కేసీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడిన మాటలు ఈ విధంగా ఉన్నాయి.

Also Read: తెలంగాణలో మరో వ్యక్తికి కరోనా, ఇద్దరు అనుమానితులు: కేసీఆర్

దాదాపు 3 గంటల క్యాబినెట్ సమావేశంలో ,ఉదయం సభలో జరిగిన దామిళ అనేక రకాలుగా చర్చలు జరిగాయి. దీనికి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు దేశంలో పుట్టిన వైరస్ కాదు,ఎక్కడో చైనా లో పుట్టింది. మనదగ్గర ఎలాంటి పాజిటివ్ కేస్ లు లేవు, ఒక్కటి వచ్చింది దాన్ని కూడా నెగిటివ్ వచ్చింది. ఇప్పుడు ఒక్క వ్యక్తి మాత్రమే వచ్చింది  గాంధీ లో చికిత్స పొందుతున్నాడు. 

ఎవరికి ఇబ్బందులు లేవుదేశంలో మొత్తం 83 మందికి సోకింది, ఇందులో 66 మంది భారతీయులు, మిగతా వారు విదేశీయులు. ఇందులో 10 మందికి నెగిటివ్ వచ్చింది. ఈ వైరస్ ఒక్కరు నుండి చాలా మందికి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చూచిస్తున్నాం. జనాలు ఎక్కువగా ఉన్న ఏరియాలోకు వెళ్లద్దు. 

ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాంటి చర్యలు,స్టెప్స్ తీసుకున్నారు. మనం కూడా ముందు జాగ్రత్తలు తీసుకున్నాం. కరోన వైరస్ ను ఎదుర్కోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం, వైద్యారోగ్య శాఖ సిద్ధంగా ఉన్నాం ఇప్పటికే 500 కోట్ల నిధి ఉంది.  ఇది సీఎస్ ఆధీనంలో ఉంటుంది.  ఎయిర్పోర్ట్ లో 200 మంది సిబ్బంది తో వచ్చేవారికి స్క్రీనింగ్ చేస్తున్నారు.

అంతర్జాతీయంగ వచ్చే వారిని నుండే వస్తుంది మనకు సముద్రతీరం లేదు.  మనకు ఇబ్బంది లేదు సమస్య మొత్తం హైదరాబాద్ చుట్టూ మాత్రమే ఉంటుంది ఇతర జిల్లాలో ఉండదు 1020 బెడ్స్ అందుబాటులో ఉన్నాయి.  321 ఇంటెన్సివ్ కేర్ యూనిట్ బెడ్స్ కూడా అందుబాటులో ఉంచాము.  240 వెంటిలేటర్ సిద్ధంగా ఉంచాము. క్వారన్తటైన్ హాస్పిటల్ సిద్ధంగా ఉంచాము.  

ఇలాంటివి రాష్ట్రంలో 4 అందుబాటులో ఉంచాము.  పంచాయతీ రాజ్, మున్సిపల్, ఫారెస్ట్ పోలీస్ శాఖ  ఆధ్వర్యంలో టాస్క్ పోర్స్ ఏర్పాటు చేశాం మంత్రి ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు పబ్లిక్ గ్యాదరింగ్ ఉండకుండా చూడాలి.  ఇవాళ్టి నుండి మార్చ్ 31 వరకు జనాలు ఎక్కువ ఉండే ప్రాంతాలు బందు చెయ్యాలని నిర్ణయం తీసుకున్నాం ఎవరైనా దీన్ని అతిక్రమణలు  చేస్తే  కఠిన చర్యలు ఉంటాయి. 

అన్ని విద్య సంస్థలు క్లోజ్ చెయ్యాలని నిర్ణయం తీసుకున్నాం.  ఇతర పరీక్షలు యధావిధిగా ఉంటాయి ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్ లో ఉండే విద్యార్థులు పరీక్షలు రాస్తారు.  మిగతా విద్యార్తులు ఇంటికి వెళ్తారు.  పంక్షన్ హాల్ లను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నాం.  ఇప్పటికే పెళ్లి డేట్ పిక్స్ అయితే పెళ్లిళ్లు చేసుకోవచ్చు.  అన్ని.  మ్యారేజ్ హాల్స్ మార్చ్ 31 తరువాత జరిగే హాల్స్ కి బుకింగ్ ఇవ్వవద్దు ఒకవేళ చేస్తే కఠిన చర్యలు ఉంటాయి. 

బహిరంగ సభలు, సమావేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సదస్సులకు ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతి లేదు.  స్పోర్ట్స్, జూ పార్క్ ఇండోర్ స్టేడియంలు మూసివేయాలని కోరుతున్నాం. అన్ని రకాల స్పోర్ట్స్ ఈవెంట్స్ రద్దు  అవుతాయి. 

ఆర్టీసీ బస్, మెట్రో రైల్ లు యధావిధిగా నడుస్తాయి. షాపింగ్ యధావిధిగా ఉంటాయి. సినిమా హాల్స్ క్లబ్ లు మూసేయాలి.  సోషల్ మీడియాలో కొందరు అతిగాళ్ళు అతిగా ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం కఠినంగా శిక్షలు ఉంటాయి.  మీడియా కూడా అతిగా చేస్తుంది. చర్యలు ఉంటాయి.  ఆరోగ్యశాఖ ఇచ్చిన రిపోర్ట్ మాత్రమే ఇవ్వాలి లేదు. అంటే కఠిన చర్యలు ఉంటాయి. ఇలాంటి ప్రచారం సమాజానికి మంచిది కాదు. సున్నితమైన ఇలాంటి సందర్భంలో ఇలా ప్రచారం చేయడం మంచిది కాదు