హైదరాబాద్: కరోనావైరస్ నేపథ్యంలో తెలంగాణలో మార్చి 31వ తేదీ వరకు పాఠశాలలకు సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శనివారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని సినిమా థియేటర్లను కూడా మూసేయాలని నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్ ప్రకారమే పదో తరగతి పరీక్షలు జరుగుతాయని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చెప్పారు. 

షాపింగ్ మాల్స్ ను కూడా మూసేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు చేసింది. శాసనసభ సమావేశాలను కూడా కుదించే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి సమావేశాలు నిర్వహించి, నిరవధిక వేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇంటర్మీడియట్ పరీక్షలు నాలుగు ఉన్నాయి. వాటిని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Also Read: భయంకరమైన కరోనావైరస్ కాంగ్రెసు: అసెంబ్లీలో పిట్టకథ చెప్పిన కేసీఆర్

ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలడంతో తెలంగాణ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. ఓ వ్యక్తి కరోనా వైరస్ కు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొంది డిశ్చార్జీ అయ్యాడు. ఇటలీ నుంచి వచ్చిన మరో వ్యక్తికి కరోనావైరస్ సోకినట్లు తేలిందని కేసీఆర్ శనివారం శాసనసభలో ప్రకటించారు. మరో ఇద్దరు అనుమానిత కరోనావైరస్ వ్యాధిగ్రస్తులు ఉన్నారని ఆయన చెప్పారు. 

కాగా, వికారాబాదు జిల్లాలోని అనంతగిరిలో కరోనా వైరస్ కోసం ప్రత్యేక ఆస్పత్రిని ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకుంది. రాజీవ్ గాంధీ విమానాశ్రయం నుంచి ప్రయాణికులను నేరుగా అనంతగిరికి తరలించి పరీక్షలు నిర్వహిస్తారు. డబ్ల్యుహెచ్ఓ ప్రతినిధులు ఆ ప్రత్యేక ఏర్పాటును పరిశీలించారు.

Also read: తెలంగాణలో మరో వ్యక్తికి కరోనా, ఇద్దరు అనుమానితులు: కేసీఆర్

మంత్రివర్గ సమావేశం తర్వాత అన్ని విషయాలను నిర్దిష్టంగా ప్రకటించాలని నిర్ణయించారు. అయితే, రేపటి నుంచి మాల్స్, బడులు, థియేటర్లు బంద్ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.