Asianet News TeluguAsianet News Telugu

దసరా రోజున టీఆర్ఎస్ఎల్పీ భేటీ: జాతీయ పార్టీ ఏర్పాటుపై కేసీఆర్ ప్రకటనకు చాన్స్

టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్  దసరా రోజున టీఆర్ఎస్ శాసనసభపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జాతీయ పార్టీకి సంబంధించిన అంశాన్ని పార్టీ ప్రజా ప్రతినిధులకు వివరించే అవకాశం ఉంది. 

KCR Plans To Conduct TRSLP meeting on October 5
Author
First Published Sep 28, 2022, 2:22 PM IST


హైదరాబాద్: దసరా రోజున టీఆర్ఎస్ శాసనసభపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు సీఎం కేసీఆర్. ఈ సమావేశంలోనే  జాతీయ పార్టీ ప్రకటనపై కేసీఆర్ ప్రకటన చేసే అవకాశం ఉంది.  అదే రోజున పార్టీ విస్తృతస్థాయి సమావేశం కూడా నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నారని సమాచారం.  ఈ సమావేశంలోనే జాతీయ పార్టీ ఏర్పాటు విషయమై పార్టీ నేతలకు కేసీఆర్ స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. గత కొన్ని రోజులుగా జాతీయ పార్టీ ఏర్పాటుపై కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు.  దసరాలోపుగానే జాతీయపార్టీ ఏర్పాటు విషయమై కేసీఆర్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం సాగుతుంది. ఈ నెల 11న తెలంగాణ సీఎం కేసీఆర్ తో కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి భేటీ అయ్యారు. సుమారు రెండు గంటలకు పైగా ఈ భేటీ సాగింది. 2023లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల లోపుగానే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వచ్చే  అవకాశం ఉందని కుమారస్వామి చెప్పారు. ఈ భేటీ ముగిసిన తర్వాత కుమారస్వామి ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు.

కొన్ని రోజులుగా ఫామ్ హౌస్ వేదికగా సీఎం కేసీఆర్ కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుపై కసరత్తు చేస్తున్నారు. ముఖ్యమైన నేతలతో కేసీఆర్ ఈ విషయమై చర్చలు జరుపుతున్నారు. జాతీయ పార్టీకి సంబంధించి జెండా, ఎజెండాపై ఫామ్ హౌస్ లో కేసీఆర్ చర్చలు నిర్వహిస్తున్నారు.ఈ చర్చలు కొలిక్కి వచ్చినట్టుగా సమాచారం.ఈ నేపథ్యంలోనే దసరా రోజున టీఆర్ఎస్ఎల్పీ , పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించాలని భావిస్తున్నారని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతుంది. ఈ సమావేశంలో జాతీయ పార్టీ ఏర్పాటుపై కేసీఆర్ పార్టీ నేతలకు వివరించే అవకాశం ఉంది. పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధుల ఏకాభిప్రాయంతో జాతీయ పార్టీ ప్రకటన చేసే అవకాశం ఉంది. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని రాష్ట్రంలోని పలు జిల్లాల అధ్యక్షులు కోరిన విషయం తెలిసిందే.ఈ మేరకు పలు జిల్లా శాఖలు తీర్మానాలు కూడా చేశాయి.

వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీని అధికారంలోకి రాకుండా నిరోధించేందుకు గాను కేసీఆర్  ఆయా పార్టీలతో చర్చలు జరుపుతున్నారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాల కారణంగానే ఆర్ధిక పరిస్థితి తిరోగమనంలోకి వెళ్తుందని కేసీఆర్ విమర్శిస్తున్నారు. రైతు ఎజెండాగా కొత్త పార్టీని ప్రకటించాలని కేసీఆర్ భావిస్తున్నారు.

భారత రైతు సమితి లేదా భారత రాష్ట్రసమితి  వంటి పేర్లను కూడా కేసీఆర్ పరిశీలిస్తున్నారు. జాతీయ పార్టీకి సంబంధించి ఎజెండాపై పార్టీ ముఖ్యులతో కేసీఆర్ చర్చిస్తున్నారని సమాచారం. పామ్ హౌస్ లో మాజీ స్పీకర్ మధుసూధనాచారి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి వంటి నేతలతో జాతీయ పార్టీ ఏర్పాటుపై కేసీఆర్ చర్చిస్తున్నారని పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది. ఈ విషయాలపై పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులకు వివరించాలనికేసీఆర్ భావిస్తున్నారు. దసరా రోజున టీఆర్ఎస్ ఎల్పీ, పార్టీ విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

also read:జాతీయ రాజకీయాలు: కేసీఆర్‌తో గుజరాత్ మాజీ సీఎం శంకర్ సింగ్ వాఘేలా భేటీ

మరో వైపు జాతీయ పార్టీ విజయవంతమయ్యేందుకు గాను కేసీఆర్ యాగం కూడ చేసే అవకాశం ఉందని సమాచారం. గతంలో  కూడా  కేసీఆర్ యాగం నిర్వహించిన విషయం తెలిసిందే. జాతీయ పార్టీ తర్వాత భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఉత్తరాదిలోనే సభ ఏర్పాటు విషయమై కూడా ప్లాన్ చేస్తున్నారు. 

2024  ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పాటు కానుందని కేసీఆర్ ధీమాగా చెబుతున్నారు. బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పాటులో తాము కీలకంగా వ్యవహరించనున్నామని కేసీఆర్ ప్రకటించారు. బీజేపీ, కాంగ్రెసేతర పార్టీల అధ్యక్షులు, సీఎంలతో కేసీఆర్ సమావేశాలు నిర్వహిస్తున్నారు.  గత మాసంలో బీహార్ వెళ్లిన సీఎం కేసీఆర్ బీహర్ సీఎం నితీష్ కుమార్, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ లతో సమావేశమయ్యారు. ఈ బేఠీ ముగిసిన తర్వాత బీహర్ సీఎం  నితీష్ కుమార్ , మాజీ  సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ లు ఢిల్లీలో సోనియాగాంధీతో భేటీ అయ్యారు.

Follow Us:
Download App:
  • android
  • ios