ముస్లింల ఓటు బ్యాంకు లక్ష్యంగా ఉర్దూలో దినపత్రిక
టీ న్యూస్, నమస్తే తెలంగాణ తో ఇప్పటికే పార్టీకి బలమైన మౌత్ టాక్ ను ఏర్పాటు చేసుకున్న సీఎం కేసీఆర్ ఇటీవల ఆంగ్ల పాఠకులను టార్గెట్ చేస్తూ తెలంగాణ టు డే పేరుతో కొత్తగా పత్రికను కూడా తీసుకొచ్చారు.
ఇవన్నీ టీఆర్ఎస్ మౌత్ పీస్ గా బాగానే పనిచేస్తున్నాయి.
సమైఖ్య రాష్ట్రంలో ఆంధ్రా మీడియా వ్యతిరేక ప్రచారం చేయడం తో అప్పట్లో రాజ్ న్యూస్ ను తీసుకొని ఆ తర్వాత టీ న్యూస్ పేరుతో పార్టీ కేంద్రంగానే చానెల్ ను నడిపారు. ఉద్యమానికి అలాగే పార్టీకి ఈ ఎలక్ట్రానిక్ మీడియా ఎంతో ఉపయోగపడింది.
తర్వాత నమస్తే తెలంగాణ పేరుతో పేపర్ ను కూడా తీసుకొచ్చారు. ఇది తెలంగాణ లో మంచి సర్క్యులేషన్ తోనే దూసుకెళ్తుంది. ఈ విజయంతోనే ఆంగ్లంలో తెలంగాణ టు డే తీసుకొచ్చారు.
ఇప్పుడు మరో కొత్త పేపర్ తీసుకొచ్చే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు. తెలంగాణ టు డే తో రాష్ట్రంలోని నార్త్ ఇండియన్ లను టార్గెట్ చేసిన సీఎం ఇప్పుడు ముస్లింలపై దృష్టిసారించారు.అందుకే ఈసారి ఉర్దూ భాషలో పేపర్ తీసుకొస్తున్నారు.
ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయడంతో పాటు, పార్టీని ముస్లింలకు మరింత దగ్గర చేసే ఉద్దేశంతో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో చాలా నియోజవర్గాల్లో ముస్లింల ఓటు బ్యాంకు డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉందన్న విషయం తెలిసిందే.
ముఖ్యంగా హైదరాబాద్ పాతబస్తీలో వార్ వన్ సైడే అన్నట్లు గా ఉంది. అందుకే కేసీఆర్ ఈ ఉర్దూ పత్రికతో ముస్లిం ఓటు బ్యాంకును కొల్లగొట్టాలని భావిస్తన్నుట్ల అర్థమవుతోంది.
అజాద్ తెలంగాణ పేరుతో ఇప్పటికే పేపర్ పేరును కూడా ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
