Asianet News TeluguAsianet News Telugu

టిఆర్ ఎస్ ఎంపిలు సభలోకి దూసు కెళ్లరాదు

పార్లమెంటులో  మర్యాదగా ఉండాలని  పింక్ బ్రిగేడ్ కు సూచనలిచ్చిన ముఖ్యమంత్రి కెసిఆర్

KCR instructs MPs to observe restraint in Parliament

టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ నోట్ల వ్యవహారాన్ని తెగే దాక లాగ దలుచుకోలేదు.

 

నోట్ల రద్దు మీద ఆయన కొంత అసంతృప్తి వ్యక్తం చేసినా అది అధికార  పార్టీలో  చివర దాకా పాకి ఎన్డీ ఎ  లేదా ప్రధాని మోదీ వ్యతిరేకతగా మారకుండా ఉండేలా జాగ్రత్త తీసుకుంటున్నట్లు ఉంది.

 

 ఆయన గురువారం  ఉదయం పార్టీ ఎంపీలతో ఫోన్‑లో మాట్లాడుతూ పార్లమెంట లో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని సూచించినట్లు తెలిసింది.

 

నోట్ల వ్యవహారం మీద తెలంగాణాకు తగిలిన దెబ్బ గురించి తానే స్వయంగా ప్రధాని మోదీని కలసి వివరించాలనుకుంటున్నందున ఉభయ సభల్లోని పింక్ బ్రిగేడ్  సంయమనం పాటించాలని సూచిస్తున్నట్లుంది.

 

సభలో జరిగే గొడవల తల దూర్చవద్దని, స్పీకర్ పోడియం వద్దకు దూసుకుపోవడం, సభ కార్యకలాపాలకు అడ్డుపడటం వంటి అపోజిషన్ చేసే పనులు చేయవద్దని ఆయన సూచించినట్లు సమాచారం.

 

 సమస్యను ప్రధానమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారమార్గం గురించి చర్చించాలనుకుంటున్నట్లు చెబుతూ  రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాలు దృష్టిలో పెట్టకుని టీఆర్ఎస్  సభ్యులు వ్యవహరాంలని ముఖ్యమంత్రి సూచించినట్లు చెబుతున్నారు.

 

బిజెపి మిత్రపక్షమయిన శివసేన కూడా నోట్ల రద్దు వ్యవహారంలో దూకుడా గా  ముందుకెళ్లి మమతానేతృత్వంలోని  ప్రతిపక్షం బృందంలో కలిస్తే, టిఆర్ ఎస్ మాత్రం నిర్మాణాత్మక ప్రతిపక్ష పార్టీగా వ్యవహరించాలను కోవడం విశేషం.

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios