Asianet News TeluguAsianet News Telugu

జగన్, పవన్ ను కడిగిపారేసిన కేసిఆర్

  • చిల్లర రాజకీయం చేయడం తగదు
  • అవిశ్వాసంతో దేశాన్ని మారుస్తరా?
kcr fire on ys jagan and pavan kalyan

తెలంగాణ సిఎం కేసిఆర్ ఆంధ్రా నేతలైన జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ మీద ఘాటుగా స్పందించారు. ప్రగతిభవన్ లో జరిగిన మీడియా సమావేశంలో కేసిఆర్ అనేక అంశాలపై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడతామంటూ ఆంధ్రాలో వైసిపి, జనసేన మాట్లాడుతున్న విషయాన్ని ఒక మీడియా ప్రతినిధి లేవనెత్తారు.

ఆ ప్రశ్నకు కేసిఆర్ చాలా ఘాటుగా మాట్లాడారు. అవిశ్వాసం పేరుతో చేస్తున్న రాజకీయాలన్నీ చిల్లర రాజకీయాలే. వీళ్లు అవిశ్వాసం పెట్టి దేశంలో మార్పు తెస్తరా? ఇది అత్యంత చిల్లర రాజకీయం తప్ప మరొకటి కాదు. ఆంధ్రాకు రావాల్సిన డిమాండ్ల సాధన కోసం ఫైట్ చేయవచ్చు కానీ.. అవిశ్వాసం పెడతా అన్న మాట సరికాదు. దానితో అయ్యేది లేదు పోయేది లేదు అని కేసిఆర్ కామెంట్ చేశారు.

మొత్తానికి ఆంధ్రాలో ఇటు జగన్, అటు పవన్ కళ్యాణ్ చేస్తున్న అవిశ్వాసం ప్రకటనలపై కేసిఆర్ తనదైన శైలిలో కామెంట్స్ చేశారు. దీంతో వారిద్దరూ చేస్తున్న రాజకీయాలు పనికిమాలినవి అని తేల్చి పారేశారు కేసిఆర్.

జాతీయ రాజకీయాల్లో తాము క్రియాశీల పాత్ర పోశిస్తామంటూ కేసిఆర్ ప్రకటించారు. కేంద్రంలో కాంగ్రెస్ వచ్చినా, బిజెపి వచ్చినా గుణాత్మకమైన మార్పులేం జరగలేదని ఆయన విమర్శించారు. కాబట్టి తాము జాతీయ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు తీసుకొచ్చే దిశగా ప్రయత్నాలు ఆరంభించామన్నారు. అయితే థర్డ్ ఫ్రంట్ రూపంలోనా? ఇంకే రూపంలోనా అన్నది ఇప్పుడే చెప్పలేమన్నారు. ఇప్పటికే తాము మాట్లాడాల్సిన వాళ్లతో మాట్లాడుతున్నట్లు చెప్పారు.

కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా పథకాల పేర్లు మార్చుడు తప్ప ఇంకోకటి లేదన్నారు. దేశమంతటికీ ఒకే నీతి ఉండాలి తప్ప రాష్ట్రానికో నీతి ఉండడం సరికాదన్నారు. పన్నుల రూపంలో తెలంగాణ నుంచి కేంద్రానికి వెళ్లిన సొమ్ము ఎంత? కేంద్రం నుంచి తెలంగాణ కు ఇచ్చిన నిధులెన్ని అన్న లెక్కలు చూసి బిజెపి నేతలు మాట్లాడాలి అని నిలదీశారు.

భారత రాజకీయాల్లో మార్పు కోసం ప్రయత్నాలు మొదలయ్యాయని కేసిఆఱర్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్, బిజెపి దొందూ దొందే అన్న ఆయన మార్పు తీసుకొచ్చే క్రమంలో నాయకత్వం వహించాల్సివస్తే తప్పకుండా నాయకత్వం వహిస్తామని స్పష్టం చేశారు.

ప్రత్యేక హోదా పేరుతో డ్రామాలు, నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఏపికి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇస్తే.. నరేంద్రమోడీ ఇచ్చి తీరాలి. హామీ ఇయ్యకపోతే ఇయ్యనని చెప్పాలి. కానీ రోజు ఏం సక్కదనం ఇది. ఆ పేరుతో ఎపి ప్రజలు అ్లలాడిపోతున్నారు. కానీ పార్టీలు మాత్రం నువ్వు కొట్టినట్లు చేయి.. నేను ఏడ్చినట్లు చేస్తా అని వ్యవహరించడం సరికాదన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios