హైదరాబాద్: వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయి కూడ తన కొడుకు వైఎస్ జగన్ ను సీఎం  చేశారని, కేసీఆర్ బతికుండి కూడ తన కూతురు కవితను నిజామాబాద్‌లో గెలిపించుకోలేకపోయారని  మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

శనివారం నాడు మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి హైద్రాబాద్‌లో మీడియాతో చిట్ చాట్ చేశారు. తెలంగాణ సమాజం స్వేచ్చను కోరుకుంటోందని, కరీంనగర్‌, నిజామాబాద్‌, మల్కాజిగిరి లోక్‌సభ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ ఓటమే అందుకు నిదర్శనమని రేవంత్‌రెడ్డి అన్నారు.

 సీఎం కేసీఆర్‌కు ఒక హెచ్చరిక పంపాలనే మల్కాజిగిరిలో తనను, కరీంనగర్‌లో బండి సంజయ్‌ని గెలిపించి నిజామాబాద్‌లో కవితను ఓడించారని ఆయన అభిప్రాయపడ్డారు. 

సంక్షేమం ముసుగులో సీఎం కేసీఆర్‌ప్రజల స్వేచ్ఛను హరిస్తున్నారని రేవంత్ రెడ్డి  ఆరోపించారు.  రాష్ట్ర ప్రజల స్వేచ్ఛ కోసం ఉప ఎన్నికలో టీఆర్‌ఎ్‌సను ఓడించాలని హుజూర్‌నగర్‌ ప్రజలను కోరామన్నారు. అయితే హుజూర్ నగర్ ప్రజలు టీఆర్ఎస్ ను గెలిపించడం వెనుక కారణాలు తెలియదన్నారు.హుజూర్ నగర్ ప్రజలు స్థానిక అంశాలను చూసుకొన్నారా, వారిపై ఒత్తిడి ఉందా అనే అంశాలు ఉన్నాయా అనే విషయమై కూడ పరిశీలించాల్సి ఉందన్నారు.

నిజామాబాద్ ఎంపీ స్థానంలో మంత్రి కేటీఆర్ తన చెల్లి కవితను గెెలిపించుకోలేకపోయారు, కానీ హుజూర్ నగర్ లో తన అక్క పద్మావతిని గెలిపించుకొంటానని హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు రెండు రోజుల ముందు రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు. కానీ, ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. 

Also Read:రాజీనామాకు ఉత్తమ్ రెడీ

హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానంలో పద్మావతిని కాంగ్రెస్ అభ్యర్ధిగా ప్రకటించడంపై రేవంత్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.ఈ విషయమై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై  క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కూడ డిమాండ్ చేశారు. 

హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానంలో చామల కిరణ్ కుమార్ రెడ్డికి టిక్కెట్టు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రేవంత్ రెడ్డికి షాకిస్తూ హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతికి టిక్కెట్టును కేటాయించింది. 

Also Readహుజూర్‌నగర్‌లో ఓటమి ఎఫెక్ట్: ఉత్తమ్‌ను పీసీసీ చీఫ్ నుండి తప్పిస్తారా?

కానీ, హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా పరాజయం పాలైంది. ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో తీవ్ర నిరాశను నింపింది. 2009 నుండి  ఈ స్థానంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధిస్తున్నారు.

Also Readఉత్తమ్‌కు సై, పద్మావతికి నై, అదే సైదిరెడ్డి విజయం :హుజూర్‌నగర్ ఓటింగ్ సరళి ఇదీ

ఈ ఉప ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి మాత్రం ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలు కావడంతో తెలంగాణ పీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానంలో మరొకరికి కేటాయిస్తారనే చర్చ తెరమీదికి వచ్చింది.