ఉత్తమ్‌కు సై, పద్మావతికి నై, అదే సైదిరెడ్డి విజయం :హుజూర్‌నగర్ ఓటింగ్ సరళి ఇదీ
హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానంలోని ఏడు మండలాల్లో టీఆర్ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డికి స్పష్టమైన మెజారిటీ వచ్చింది.కాంగ్రెస్ పార్టీకి ఏ ఒక్క మండలంలో కూడ మెజారిటీ రాలేదు. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ కు రెండు మండలాల్లోనే ఆధిక్యత వచ్చింది. కానీ ఈ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ కు ఒక్క మండలంలో కూడ ఆధిక్యత రాలేదు.
హైదరాబాద్: హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్ధి శానంపూడి సైదిరెడ్డికి నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో మెజారిటీ వచ్చింది. ఏ మండలంలో కూడ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ రాలేదు. గత ఎన్నికల్లో రెండు మండలాల్లో టీఆర్ఎస్ అభ్యర్ధికి మెజారిటీ వచ్చింది. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏ మండలంలో కూడ ప్రభావం చూపలేకపోయింది.
హుజూర్‌నగర్ అసెంబ్లీ స్తానంలో టీఆర్ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డికి 1,13,094 ఓట్లు వచ్చాయి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి పద్మావతి ఉత్తమ్ కుమార్ రెడ్డికి 69,736,, ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్ధి కోట రామారావు, టీడీపీ అభ్యర్ధి చావా కిరణ్మయికి 1827 ఓట్లు వచ్చాయి.
read more సైదిరెడ్డి విజయం ప్రభుత్వానికి టానిక్: ఎల్లుండి హుజూర్ నగర్ కు కేసీఆర్
ఇక కాంగ్రెస్ పార్టీ తర్వాత మూడో స్థానంలో సుమన్ అనే ఇండిపెండెంట్ అభ్యర్థికి 2693 ఓట్లు వచ్చాయి. సుమన్ కంటే టీడీపీ, బీజేపీ అభ్యర్ధులకు తక్కువ ఓట్లు వచ్చాయి.
2018 డిసెంబర్ 7వ తేదీన జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్ధి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి మఠంపల్లి, గరిడేపల్లి మండలాలు మినహా మిగిలిన ఐదు మండలాల్లో లీడ్ వచ్చింది. ఈ లీడ్‌తోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో నేరేడుచర్ల మంలంలో టీఆర్ఎస్ అభ్యర్ధి కంటే కాంగ్రెస్ అభ్యర్ధి ఉత్తమ్ కుమార్ రెడ్డికి 1902 ఓట్లు ఆధిక్యం లభించింది. పాలకవీడు(పాలకీడు)లో సైదిరెడ్డి కంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి 1701 ఓట్లు, మేళ్లచెరువులో 611 ఓట్లు, చింతలపాలెంలో1144 ఓట్లు, హుజూర్‌నగర్‌లో 1776 ఓట్ల మెజారిటీ లభించింది. మఠంపల్లి, గరిడేపల్లి మండలాల్లో మాత్రమే టీఆర్ఎస్ కు ఆదిక్యత వచ్చింది. మఠంపల్లిలో కాంగ్రెస్ కంటే టీఆర్ఎస్ కు 355 ఓట్లు, గరిడేపల్లిలో166 ఓట్ల మెజారిటీ వచ్చింది.
read more హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ విజయంపై కవిత ట్వీట్
ఇక ఈ నెల 21న జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డికి ఏడు మండలాల్లో మెజారిటీ వచ్చింది. ఏ ఒక్క మండలంలో కూడ టీఆర్ఎస్ అభ్యర్ధిని మెజారిటీని కాంగ్రెస్ అడ్డుకోలేకపోయింది. ఈ ఎన్నికల్లో హుజూర్‌నగర్ మండలంలో టీఆర్ఎస్‌కు 10746 ఓట్లు, గరిడేపల్లిలో7172, నేరేడుచర్లలో6750 ఓట్లమెజారిటీ వచ్చింది.మఠంపల్లి మండలంలో6687 ఓట్లు, పాలకవీడు (పాలకీడు)లో 4250 ఓట్ల, మేళ్లచెర్వులో 3931 ఓట్లు, చింతలపాలెంలో3748 ఓట్ల మెజారిటీ దక్కింది.
హుజూర్ నగర్లో మాత్రం గత దఫా కన్నా పోలింగ్ శాతం అధికంగా నమోదవ్వడం విశేషం. ఈ పెరిగిన శాతం తమకంటే తమకు లాభం కలిగిస్తుందని ఇటు తెరాస, కాంగ్రెస్ లు తెగ వాదులాడుకుంటున్నాయి. ఇటు అధికార తెరాస, సిట్టింగ్ కాంగ్రెస్ ఇరు పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పోరు ఉత్కంఠంగా మారింది. ఒక రెఫరెండం మాదిరిగా ఈ ఎన్నికను అందరూ భావించడం వల్ల ప్రజలు భారీ సంఖ్యలో ఓట్లు వేశారు.