హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీని రద్దు చేస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే ఉద్దేశ్యంతోనే సీఎం కేసీఆర్ అధ్యక్షతన గురువారం నాడు ప్రగతి భవన్ లో జరిగిన  కేబినెట్ సమావేశం ఈ మేరకు  అసెంబ్లీని రద్దు చేయాలని  తీర్మానం చేసింది.

తెలంగాణ సీఎంగా  కేసీఆర్  2014 జూన్ 2వ తేదీన  కేసీఆర్  ప్రమాణం చేశారు.  ఇవాళ్టికి సీఎంగా కేసీఆర్ 1546 రోజుల పాటు పాలన సాగించాడు.అంటే సుమారు 4 ఏళ్ల మూడు మాసాల 4 రోజుల పాటు సీఎంగా కొనసాగారు. 

తెలంగాణలో ప్రస్తుతమున్న  రాజకీయ పరిస్థితుల కారణంగా  కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నారని  టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత సీఎం కేసీఆర్ సహా మంత్రులు  రాజ్ భవన్ కు చేరుకొన్నారు.

రాజ్ భవన్ లో కేసీఆర్  గవర్నర్ తో సమావేశమై అసెంబ్లీ రద్దు గురించి ప్రతిని   గవర్నర్ కు అందించనున్నారు. 

సంబంధిత వార్తల కోసం క్లిక్ చేయండి:

ప్రారంభమైన తెలంగాణ కేబినెట్ భేటీ: అసెంబ్లీ రద్దుపైనే తీర్మానం?

ముందస్తు: సీఎంగా కేసీఆర్ 1546 రోజుల పాలన

అసెంబ్లీ రద్దు: తర్వాత జరిగేది ఇదే..!