అవసరం లేక పోయినా అపరేషన్లు చేస్తున్నారు, గర్భ సంచులు తొలగిస్తున్నారు. ఇది నీచం, దుర్మార్గం

సిజేరియన్ ఆపరేషన్లతో వ్యాపారం చేస్తున్న ప్రయివేటుడాక్టర్ మీద ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.

‘కొందరు ప్రయివేటు డాక్టర్లు రాక్షుసుల్లో వ్యవహబరిస్తున్నారు.అవసరం ఉన్నా లేకున్నా ఆపరేషన్లు చేస్తున్నారు. గర్భ సంచులుతొలగిస్తున్నారు. ఇది పరమ దుర్మార్గం. నీచమైన పని,’ అని ఆయన మండిపడ్డారు.

సోమవారంనాడు ప్రగతి భవన్‌లో అంగన్‌వాడీ కార్యకర్తలతో సీఎం సమావేశమయి వారి సమస్యల గురించి చర్చించారు.

అంగన్ వాడి కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని చెబుతూ ప్రభుత్వాసుపత్రులలో ప్రసవాలు పెరిగేందుకు కృషి చేయాలని వారికి సలహా ఇచ్చారు.

ఆడపిల్ల పుడితే రూ.13 వేలు!

అంగన్‌వాడీ కార్యకర్తలకు రూ. 10,500, సహాయక సిబ్బందికి రూ. 6000 పెంచుతున్నట్లు తెలిపారు. ఉన్నత విద్యార్హతలు ఉన్న వారికి సూపర్‌వైజర్‌గా పదోన్నతి కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఉన్నతాధికారుల వేధింపులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. 


పిల్లల ఆరోగ్యం విషయంలో రాజీ పడొద్దని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెరిగేందుకు అంగన్‌వాడీలు చర్యలు తీసుకోవాలన్నారు. గర్భిణీలకు మూడు విడతల్లో రూ. 12 వేలు ఇచ్చే యోచనలో ఉన్నామని తెలిపారు. ఆడపిల్ల పుడితే మరొక వేయి కలిపి రూ. 13 వేలు ఇచ్చే ప్రతిపాదనలు రూపొందిస్తున్నామని ఆయన వెల్లడించారు. పిల్లల ఇమ్యూనైజేషన్ కోసం మరికొంత సహాయం కలిపి మొత్తం పదిహేను వేల వరకు అందించాలనుకుంటామని ఆయన చెప్పారు.