కేంద్ర కేబినెట్ లో టీఆర్ఎస్ చేరుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో దీనికి బలం చేకూర్చేలా ఎంపీ కవిత మాట్లాడారు.

 

పెద్ద నోట్ల రద్దు తర్వాత మోదీకి సీఎం కేసీఆర్ సంపూర్ణ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.

 

అయితే ఈ విషయంపై కవిత స్పందిస్తూ.. పెద్ద నోట్ల రద్దుపై తప్పని పరిస్థితుల్లోనే కేంద్రానికి మద్దతు ఇచ్చామని చెప్పారు.

http://telugu.asianetnews.tv/telangana/will-trs-get-berth-in-union-cabinet

 

అలాగే, కేంద్ర కేబినెట్‌లో టీఆర్ఎస్ చేరడంపై వస్తున్న ఊహాగానాలపై మాట్లాడుతూ.. ఇప్పటివరకు దీనిపై చర్చ జరగలేదని,  కేంద్ర కేబినెట్ లో చేరడం అనేది సీఎం కేసీఆర్ ఒప్పుకుంటేనే జరుగుతుందని స్పష్టం చేశారు.

 

పదవుల కోసమే కేంద్రానికి మద్దతిచ్చారనడం సరికాదన్నారు.