హైద్రాబాద్‌కు బయలుదేరిన కవిత, మంత్రులు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత , మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు హైద్రాబాద్ కు తిరిగి వచ్చారు.
న్యూఢిల్లీ: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ లు గురువారంనాడు మద్యాహ్నం హైద్రాబాద్ కు బయలు దేరారు.నిన్న ఉదయం కల్వకుంట్ల కవిత న్యూఢిల్లీకి వచ్చారు. భారత జాగృతి సమితి ఆధ్వర్యంలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత కవిత మీడియాతో మాట్లాడారు. ఇవాళ జరిగే ఈడీ విచారణకు హాజరు కానున్నట్టుగా కవిత తెలిపారు.
కవిత ఇవాళ ఈడీ విచారణకు హాజరు కానున్నందున కేటీఆర్, హరీష్ రావు , ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్ లు న్యూఢిల్లీకి చేరుకున్నారు.
ఇవాళ ఉదయం 11 గంటలకు కవిత ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ ఆమె మాత్రం ఈడీ విచారణకు హాజరు కాలేదు. విచారణకు హాజరు కాలేనని కవిత ఈడీకి లేఖ పంపారు.సుప్రీంకోర్టులో తాను పిటిషన్ దాఖలు చేసినందున విచారణకు రాలేనని పేర్కొన్నారు.ఈ నెల 24వ తేదీన సుప్రీంకోర్టు తీర్పు తర్వాత విచారణకు హాజరౌతనని ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు.
also read:ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత అనుమానితురాలు: పిళ్లైకి ఈ నెల 20 వరకు ఈడీ కస్టడీ పొడిగింపు
అయితే కవితకు మరో వైపు ఈ నెల 20వ తేదీన విచారణకు రావాలని ఇవాళ మరోసారి కవిత కు నోటీసులు ఇచ్చారు.ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు విషయమై కీకల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ తరుణంలో కవిత న్యాయ పరమైన అన్ని రకాల అవకాశలను వినియోగించుకొనే అవకాశం లేకపోలేదు. ఇవాళ ఢిల్లీలో జరిగిన పరిణామాలను హైద్రాబాద్ కు తిరిగి వచ్చిన తర్వాత కవిత కేసీఆర్ తో చర్చించే అవకాశం లేకపోలేదు. ఈ నెల 11వ తేదీన ఈడీ విచారణకు హాజరైన కవిత న్యూఢిల్లీ నుండి హైద్రాబాద్ కు తరిగి రాగానే ప్రగతి భవన్ కు వెళ్లి కేసీఆర్ తో సమావేశమయ్యారు.