Asianet News TeluguAsianet News Telugu

ప్రవాస తెరాస అనుభవం తెలంగాణాకు అవసరం : కవిత

అంతర్జాతీయ వేదికల  మీది నుంచి తెలంగాణా గొప్పతనాన్ని చాటిచెప్పాలని పిలుపు

Kavita urges TNRIs to guide Telangana government with experience they acquired Abroad

అభివృద్ధిచెందిన దేశాల్లో ఉంటున్న తెలంగాణా వారు ఇక్కడి పద్దతులను అధ్యయనం చేసి  రాష్ట్రం లో పరిపానల మెరుగు పడేందుకు  ప్రభుత్వానికి సూచనలు  -సలహాలు అందించాలని నిజాంబాద్ ఎంపి కవిత తెలంగాణా ప్రవాసులకు పిలుపు నిచ్చారు.  ఇదే విధంగా ప్రపంచ వేదికల్ మీది నుంచి తెలంగాణ ఖ్యాతిని, నాయకుడు కెసిఆర్ గారి గొప్పతన్నాని  చాటి చెప్పాలని కూడా ఆమె విజ్ఙప్తి చేశారు.

 

అమె ఈ రోజు లండన్ లో జరిగిన  తెలంగాణా రాష్ట్ర సమితి ఎన్నారై సెల్ యుకె నూతన  కార్యవర్గ సమావేశానికి అధ్యక్షత  వహించారు.

ఈ సందర్బంగా మాట్లాడుతూ ఎన్నో త్యాగాలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కూడా పటిష్టనాయకత్వంతోనే సాధ్యమవుతుందని  ఆమె అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర సమితి కట్టుబడి వుందని చెబుతూ కెసిఆర్ నాయకత్వంలోనే తెలంగాణాభివృద్ధి సాధ్యమని కవిత చెప్పారు.

 

పార్టీకి, పార్టీ  నాయకత్వానికి ఎన్నారై టి.ఆర్.యస్ యుకె సభ్యుల పట్ల ప్రత్యేక గౌరవం ఉందని, ఉద్యమం నుండి నేటి వరకు పార్టీ వెంటేఉండి, ఎంతో బాధ్యతగా సేవ చేస్తున్నారని, తప్పకుండ పార్టీ అన్ని సందర్భాల్లో మీకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

 

ఈ కార్యక్రమంలో ప్రవాస తెరాస కార్యకర్తల బాధ్యత, పార్టీ నిర్మాణానికి కృషి, తెలంగాణ రాష్ట్రం లో తెరాస ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలని ప్రజల్లోకితీసుకెళ్లే వినూత్న విధానాలు, యుకె లో వివిధ వేదికల్లో తెలంగాణ ను మరియు తెలంగాణ నాయకత్వాన్ని ప్రదర్శించే అవకాశాలు మరియుభవిషత్తు కార్యక్రమాల పై దిశా నిర్దేశం తదితర అంశాల  గురించి చర్చించారు.

 

ఎన్నారై టి ఆర్ ఎస్ సెల్ అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం ముందుగా సంస్థ   చేపడుతున్న కార్యక్రమాలనిభవిష్యత్తు ప్రణాలికను  కవిత గారికివివరించడం జరిగింది. ప్రవాస తెరాస శ్రేణుణులకు శిక్షణా తరగతులను నిర్వహించి ప్రభుత్వ పథకాల పై అవగాహనా కల్పించాలని ఈ సమావేశంలో నిర్ణయించడం జరిగింది.

 

అధికారిక పర్యటనలో భాగంగా లండన్ వచ్చినప్పటికీ, ప్రత్యేక సమయాన్ని కేటాయించి కార్యవర్గ సమావేశం లో పాల్గొని సభ్యులందిరిలోస్ఫూర్తినింపినందుకు కవిత గారికి ప్రతి ఒక్కరు కృతజ్ఞతలు తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో అద్యక్షులు అనిల్ కూర్మాచలం, ఉపాధ్యక్షులు అశోక్ దూసరి, నవీన్ రెడ్డి, ,శ్రీకాంత్ పెద్దిరాజు , ప్రధాన కార్యదర్శి రత్నాకర్, అడ్వైజరీ  బోర్డు సభ్యులు సత్యం రెడ్డి కంది, ప్రవీణ్ కుమార్ వీర ,సెక్రటరీ లు సృజన్ రెడ్డి ,శ్రీధర్ రావు తక్కళ్లపల్లి , సంయుక్త కార్యదర్శిమల్లా రెడ్డి   ,మీడియా ఇంచార్జ్ శ్రీకాంత్ జెల్ల ,యూకే & ఈయూ ఇంచార్జ్ విక్రమ్ రెడ్డి,IT సెక్రటరీ వినయ్ ఆకుల , కోశాధికారి మధుసూదన్ రెడ్డి,లండన్ ఇంచార్జ్ సతీష్ రెడ్డి బండ ,ఈస్ట్ లండన్ కో ఆర్డినేటర్ రమేష్ యెసంపల్లి ,నవీన్ మాదిరెడ్డి , ఈవెంట్స్ ఇంచార్జ్ సత్యపాల్ పింగిళి,ఈవెంట్స్  కో ఆర్డినేటర్స్ నవీన్ భువనగిరి ,రవి ప్రదీప్,సత్య చిలుముల  ,వెస్ట్ లండన్ ఇంచార్జ్ గణేష్ పాస్తం,సురేష్ బుడగం , మరియు ముఖ్యసభ్యులు రవి కుమార్ రత్తినేని,హాజరైన వారిలో వున్నారు.

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios