శ్రీరాముడిపై కత్తి పొగడ్తలు

kathi mahesh prises lord sri rama
Highlights

ఆ శ్లోకాన్ని కత్తి.. చాలా రాగాయమానంగా ఆాలపించడం విశేషం.అంతలో ఎంత మార్పు అంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు

శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసి నగర బహిష్కరణకు గురైన కత్తి మహేష్.. ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చాడు. శ్రీరాముడిని పొగుడుతూ శ్లోకం చెప్పాడు. 'శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం' అనే శ్లోకాన్ని స్తుతిస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది.

ఆ శ్లోకాన్ని కత్తి.. చాలా రాగాయమానంగా ఆాలపించడం విశేషం.అంతలో ఎంత మార్పు అంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే అసలు విషయం ఏంటంటే.. ఆయన ఆ శ్లోకం చెప్పింది ఇప్పుడు కాదు. గత శ్రీరామనవమి సమయంలో చెప్పిన శ్లోకం ఇది. చిన్నప్పుడు చాలా బట్టీపట్టి నేర్చుకున్నానని ఆ వీడియోలో తెలిపారు.
 
బుధవారం ఫేస్‌బుక్ ‌లైవ్‌లో మాట్లాడిన మహేశ్... తాను కర్ణాటకలో సేఫ్‌గా ఉన్నానని చెప్పారు. అయితే తన బహిష్కరణ పురాతన కాలం శిక్షలను తలపిస్తోందని వాపోయారు. అలాగే స్వామి పరిపూర్ణానంద  బహిష్కరణను కూడా ఖండిస్తున్నట్టు చెప్పారు.  చాలా గౌరవప్రదంగా హైదరాబాద్ వస్తానని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు కత్తి.

loader