హైద్రాబాద్ పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో  కారును ఎత్తుకెళ్లిన  నిందితులను  పోలీసులు గుర్తించారు.  నిందితుల కోసం  పోలీసులు గాలింపు  చర్యలు చేపట్టారు. 

హైదరాబాద్: నగరంలోని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రైవర్ ను కొట్టి క్యాబ్ ను ఎత్తుకెళ్లిన కేసులో పోలీసులు పురోగతిని సాధించారు. కర్ణాటకకు చెందిన ముఠా క్యాబ్ ను దొంగిలించారని పోలీసులు గుర్తించారు . గురువారం నాడు అర్ధరాత్రి శంషాబాద్ ఎయిర్ పోర్టులో నిందితులు క్యాబ్ ను బుక్ చేసుకున్నారు. బాలాపూర్ సమీపంలోని నిర్మానుష్క ప్రాంతంలోకి తీసుకెళ్లిన తర్వాత డ్రైవర్ ను కొట్టి క్యాబ్ ను ఎత్తుకెళ్లారు దుండగులు .

also read:హైద్రాబాద్‌లో దారుణం: డ్రైవర్‌ను కొట్టి క్యాబ్‌ ను ఎత్తుకెళ్లిన దుండగులు

ఈ విషయమై బాదితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేశారు. కర్ణాటకకు చెందిన ముఠా ఈ కారును ఎత్తుకెళ్లిందని గుర్తించారు. ఈ ముఠా కోసం రాచకొండకు చెందిన నాలుగు పోలీస్ బృందాలు కర్ణాటక రాష్ట్రానికి బయలుదేరాయి.