15 రోజులుగా కేసీఆర్ కనిపించడం లేదు.. కేటీఆర్‌పైనే అనుమానం , మా సీఎంను చూపించండి : సంజయ్ కీలక వ్యాఖ్యలు

15 రోజులుగా సీఎం కేసీఆర్ కనిపించడం లేదని.. కేటీఆర్‌పై అనుమానంగా వుందంటూ వ్యాఖ్యానించారు  కరీంనగర్ ఎంపీ బండి సంజయ్.  సీఎం కేసీఆర్‌తో ఒక ప్రెస్‌మీట్ పెట్టించాలని.. మా ముఖ్యమంత్రిని ఒకసారి చూపించాలంటూ సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

karimnagar mp bandi sanjay sensational comments on telangana cm kcr and his family ksp

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 15 రోజులుగా సీఎం కేసీఆర్ కనిపించడం లేదని.. కేటీఆర్‌పై అనుమానంగా వుందంటూ వ్యాఖ్యానించారు. మోడీపై కేసీఆర్ కుమారుడు అజయ్ రావు విషం నింపుకున్నాడని.. 4 కోట్ల మంది కోసం తెలంగాణ తెచ్చుకుంటే అది నలుగురి పాలైందని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ తెలంగాణ పర్యటన తర్వాత బీఆర్ఎస్‌లో ప్రకంపనలు మొదలయ్యాయని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్‌తో ఒక ప్రెస్‌మీట్ పెట్టించాలని.. మా ముఖ్యమంత్రిని ఒకసారి చూపించాలంటూ సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

కేసీఆర్‌ను కేటీఆర్ ఏమైనా చేశారా ? ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడా..? ఎందుకంటే ఆయన మా సీఎం.. ఆయనను కాపాడుకోవాల్సిన బాధ్యత మాపై ఉందని సంజయ్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ ప్రెస్‌మీట్ పెడితేనే ఆయన క్షేమంగా వున్నారని నమ్ముతామని అన్నారు.  కేసీఆర్ దగ్గరకు ఎవరినీ వెళ్లనీయడం లేదని.. అఖరికి ఎంపీ సంతోష్‌రావును కూడా దూరం పెట్టారని ఆరోపించారు. కేసీఆర్ కనబడితే క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నట్టుగా సంజయ్ చెప్పారు. నిజామాబాద్‌లో మోదీ చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 

ALso Read : కేటీఆర్ సీఎం అనగానే బీఆర్ఎస్ చీలిపోయే పరిస్థితి.. ఎంఐఎంకు కరీంనగర్‌లో పోటీ చేసే దమ్ముందా?: బండి సంజయ్

మోదీని ప్రపంచ దేశాలు ఒక హీరోలా చూస్తున్నాయని అన్నారు. దేశ ప్రధాని మీద బీఆర్ఎస్, కేసీఆర్ కుటుంబం చిల్లర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో నలుగురు మాత్రమే బాగుండాలని కొరుకుంటున్నారని బీఆర్‌ఎస్‌పై బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. వేరే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎందుకు కావడం లేదని ప్రశ్నించారు. మోదీ పర్యటన తర్వాత ప్రగతిభవన్‌లో భూకంపం వస్తుందని అన్నారు. మోదీ కుండబద్దలు కొట్టినట్టుగా మాట్లాడితే కేసీఆర్ కుటుంబంలో లొల్లిలు మొదలయ్యాయని అన్నారు. 

మోదీ వ్యాఖ్యలతో బీఆర్ఎస్ పార్టీలో ప్రకంపనలు ప్రారంభమయ్యాయని.. కేటీఆర్ ముఖ్యమంత్రి అనగానే బీఆర్ఎస్ పార్టీ చీలి పొయే పరిస్థితి వచ్చిందని చెప్పుకొచ్చారు. కేటీఆర్ సీఎం అయితే ఎలా భరిస్తమని ఎమ్మెల్యేల లొల్లిలు షురూ అయ్యాయని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ భ్రష్టు పట్టడానికి కేటీఆరే కారణమని విమర్శించారు. కేటీఆర్ బాష సరిగా లేదని.. తాము తిట్టడం షురూ చేస్తే తట్టుకోలేరని అన్నారు. కర్ణాటక ఎన్నికలకు డబ్బులు ఇవ్వడానికి బీఆర్ఎస్‌కు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభం అయినప్పటీ ఆస్తులు, ఇప్పుడున్న ఆస్తులు చెప్పే ధైర్యం కేసీఆర్ కుటుంబానికి ఉందా? అని ప్రశ్నించారు.  

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios