కరీంనగర్ బీజేపీ ఎంపీ సంజయ్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఏఏను వ్యతిరేకిస్తున్న వారంతా దేశద్రోహులేనని.. అలాంటి వారిని బ్రేకుల్లేని బస్సులో పాకిస్తాన్‌కు పంపుతానంటూ వ్యాఖ్యానించారు. మీరు రాళ్లు పట్టుకుంటే, తాము బాంబులు పడతామని సంజయ్ హెచ్చరించారు. అసదుద్దీన్ ఒవైసీ ఆటలు తెలంగాణలో సాగనివ్వమన్నారు.

ట్రిపుల్ తలాక్ బిల్లు, అయోధ్యపై తీర్పు వంటి కీలక సమయాల్లో దేశంలో ఎక్కడా అల్లర్లు జరగలేదని, కానీ సీఏఏ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందినప్పటి నుంచి బీజేపీకి వ్యతిరేకంగా కావాలని ఉద్యమాలు చేస్తున్నారని సంజయ్ మండిపడ్డారు.

Also Read:అసద్‌ను నిజామాబాద్‌లో క్రేన్‌కు వేలాడదీస్తా: బీజేపీ ఎంపీ అరవింద్ సంచలనం

ప్రజలను తప్పుదోవ పట్టించి ఎలాగైనా వాళ్లను గద్దె దించి, తాము అధికారాన్ని చేపట్టాలని కొందరు కుట్రలు చేస్తున్నారని సంజయ్ ఆరోపించారు. సీఏఏ బిల్లు ఆమోదం పొందే సమయంలో పెద్ద ఎత్తున చర్చ జరిగిందని, అనేక పార్టీలు లేవనెత్తిన ప్రశ్నలను అమిత్ షా నివృత్తి చేశారని ఎంపీ గుర్తుచేశారు. 

కొద్దిరోజుల క్రితం నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సైతం అసదుద్దీన్ ఒవైసీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసుదుద్దీన్ ఓవైసీని నిజామాబాద్‌లో క్రేన్ కు వేలాడదీస్తానని చెప్పారు.అసద్‌ గడ్డం కోసి కేసీఆర్‌కు అతికిస్తానని చెప్పారు. నిజామాబాద్ మేయర్ పదవిని ఎంఐఎంకు  అప్పగించేందుకు టీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోందని అరవింద్ ఆరోపించారు.

కేసీఆర్ ముళ్లరూపంలో ఉన్న ముఖ్యమంత్రి అంటూ అరవింద్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.  మజ్లిస్ కు తొత్తుగా టీఆర్ఎస్ వ్యవహరిస్తోందని అరవింద్ విమర్శలు గుప్పించారు.ఆరేళ్లుగా దేశంలో మంచి పనుులు జరుగుతున్నాయని ధర్మపురి అరవింద్ చెప్పారు. గతంలో దేశంలో ఇటాలియన్ మాఫియా రాజ్యం నడిచిందన్నారు. 

Also Read:టీఆర్ఎస్‌తో దోస్తీ: విస్తరణకు ఎంఐఎం వ్యూహమిదీ..

గత ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన ఎన్నికల్లో నిజామాబాద్  నుండి జరిగిన బీజేపీ అభ్యర్ధిగా అరవింద్ పోటీ చేసి విజయం సాధించాడు. సిట్టింగ్ టీఆర్ఎస్ ఎంపీ కవితపై ఆయన విజయం సాధించారు.

నిజామాబాద్‌లో అరవింద్ విజయం సాధించడం సంచలనం. అయితే కరీంనగర్‌తో పాటు, నిజామాబాద్ ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన క్యాడర్ బీజేపీకి  ఓటు చేసినట్టుగా టీఆర్ఎస్ స్థానిక నాయకత్వం అప్పట్లోనే పార్టీ చీఫ్ కేసీఆర్‌కు నివేదిక ఇచ్చింది. ఈ ప్రచారాన్ని కాంగ్రెస్ తోసిపుచ్చింది.

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవికి కూడ అరవింద్  పోటీ పడుతున్నాడు.  ఈ తరుణంలో అరవింద్ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీపై చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి.