కల్వకుంట్ల కవిత బిఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.
Kalvakuntla Kavitha : బిఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. స్పీకర్ ఫార్మాట్ లో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి పంపుతున్నట్లు తెలిపారు. ఇక బిఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు... ఈ లేఖను బిఆర్ఎస్ పార్టీకి పంపిస్తున్నట్లు తెలిపారు.

కేసీఆర్ కుటుంబం రేవంత్ తో పోరాడుతుంటే... హరీష్ రావు ఆయనతో కలిసి పనిచేస్తున్నారని కవిత ఆరోపించారు. హరీష్ పాల వ్యాపారం విషయంలో ఆరోపణలు వచ్చినా ఎలాంటి చర్యలు ఉండవన్నారు.కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అంతా హరీష్ రావుదే... ఆయనే మంత్రి ఈ ప్రాజెక్టు టెక్నికల్, ఇతర విషయాలు చూసపుకున్నారని అన్నారు. ఆయనవల్లే కేసీఆర్ కుటుంబం లక్ష కోట్ల అవినీతి చేసిందని ఆరోపణలు వచ్చాయి... రేవంత్ పదేపదే అదే విషయాన్ని హైలైట్ చేస్తున్నారని కవిత అన్నారు. హరీష్ తో రేవంత్ మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తున్నారని ఆరోపించారు.
హరిష్, సంతోష్ మన మంచి కోరుకునేవారు కాదు రామన్న... వాళ్లను మీరు దూరం పెట్టండి అని కేటీఆర్ కు సూచించారు. నాన్న పేరు బాగుండాలంటే హరీష్, సంతోష్ లను దూరం పెట్టాలని కవిత కోరారు.
హరీష్ ట్రబుల్ షూటర్ కాదు బబుల్ షూటర్ అని కవిత ఎద్దేవా చేశారు. ఇటీవల దాసోజు శ్రవణ్ ఎమ్మెల్సీ ఎన్నికలో ట్రబుల్ చేయడానికి హరీష్ ప్రయత్నించారు.. బిజెపితో కలిసి డబుల్ గేమ్ ఆడే ప్రయత్నం చేశారన్నారు. ఈ విషయాన్ని బిజెపి ఎమ్మెల్యే తనకు చెప్పాడన్నారు... ఈ విషయం కేసీఆర్ కు చెప్పానని అన్నారు. కాంగ్రెస్, బిజెపితో హరీష్ రావు టచ్ లో ఉన్నారని కవిత ఆరోపించారు.
