Asianet News TeluguAsianet News Telugu

చిక్కుల్లో కల్వకుంట్ల కవిత.. లిక్కర్ పాలసీ స్కామ్ లో ఆమె పాత్ర ఉంద‌ని బీజేపీ ఆరోప‌ణ‌

లిక్కర్ పాలసీ స్కామ్ లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రమేయం ఉందని బీజేపీ సంచలన ఆరోపణలు చేసింది. దీంట్లో కోట్లాది రూపాయిల అవీనితి జరిగిందని ఆరోపించింది. 

 

 

Kalvakuntla kavitha in trouble.. BJP alleges that she has a role in the liquor policy scam
Author
First Published Aug 22, 2022, 9:53 AM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత కొత్త చిక్కుల్లో ప‌డ్డ‌ట్టు క‌నిపిస్తున్నారు. దేశ రాజ‌ధాని ఢిల్లీలో వెలుగులోకి వ‌చ్చిన లిక్క‌ర్ స్కామ్ లో ఆమె ప్ర‌మేయం ఉంద‌ని బీజేపీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. ఢిల్లీలోని రాజౌరి గార్డెన్ నియోజకవర్గంలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ సర్సా ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్య‌లు చేశారు. “ కవిత ఒబెరాయ్ హోటల్‌లో సమావేశాలను సులభతరం చేశారు. దక్షిణాది నుండి మద్యం వ్యాపారులను తీసుకువచ్చింది. మాగుంట కుటుంబ సభ్యుల పేరుతో మద్యం లైసెన్సుల కోసం ముందుగా డబ్బులు చెల్లించారు. పంజాబ్, గోవా ఎన్నికలకు కూడా ముందుగానే డబ్బులు ఇచ్చారు. ’’ అని ఆయన ఆరోపించారు.

నేడు కేజ్రీవాల్, మనీష్ సిసోడియాల గుజ‌రాత్ ప‌ర్య‌ట‌న‌.. పోలీస్ ప్రొటెక్ష‌న్ కోరిన ఆప్

ఢిల్లీలో కొత్త లిక్క‌ర్ పాలసీని అమలు చేయడంలో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ సిసోడియాతో పాటు హైదరాబాద్‌కు చెందిన అరుణ్ రామచంద్రన్ పిళ్లై సహా ఇతరులపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కేసు నమోదు చేసింది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. 

పంజాబ్‌లోని డిస్టిలరీని సీల్ చేయకుండా పొందేందుకు కవిత సిసోడియాకు 4.5 కోట్ల రూపాయల లంచం ఇచ్చారని, అందులో 3.5 కోట్ల రూపాయలను నగదు రూపంలో చెల్లించి క్రెడిట్ నోట్ ద్వారా రెస్ట్ తీసుకున్నార‌ని ఆరోపించారు. “ ఇవన్నీ ఇవ్వడం, తీసుకోవడంలో కవిత పాత్ర ఉంది. ఆమె సమావేశాలు నిర్వహించింది. ఆమె చద్దా కుటుంబాన్ని కలుసుకుంది. డబ్బు తీసుకుని వారి ఫ్యాక్టరీకి సీలు వేయలేదు” అని ఆయ‌న  అన్నారు. 

మొయినాబాద్ లో కారు ప్రమాదం, ఇద్దరి మృతి.. అతివేగమే కారణం

కాగా.. టీఆర్‌ఎస్‌ పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి అల్లుడు సృజన్‌రెడ్డి ఆర్థిక లావాదేవీలను కూడా సీబీఐ తనిఖీ చేస్తోంది. నగరానికి చెందిన ఫార్మా కార్పొరేట్‌తో కలిసి సృజన్‌రెడ్డి దేశ రాజధానిలో మద్యం వ్యాపారంలో పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది.  కాగా.. ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనపై దేశ రాజధాని ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో జరిగిన సమావేశాలకు చంద్రశేఖర్ రావు కుటుంబ సభ్యులు హాజరయ్యారని బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ ఆరోపించారు. తెలంగాణకు కూడా ఢిల్లీ మాదిరిగానే సారూప్య ఎక్సైజ్ పాలసీ ఉందని, పశ్చిమ బెంగాల్‌లో కూడా దీనిని అమలు చేస్తున్నారని వర్మ చెప్పారు. “ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనపై ఒక హోటల్‌లో జరిగిన సమావేశాలకు తెలంగాణ సీఎం కె. చంద్రశేఖర్ రావు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు పంజాబ్‌లోనూ అదే విధానాన్ని అమలు చేశారు. మనీష్ సిసోడియా, అరవింద్ కేజ్రీవాల్‌తో కలిసి ఢిల్లీలో ప్రణాళిక సిద్ధం చేశారు’’ అని వర్మ ఆరోపించారు.

నేటీతో ముగియ‌నున్న వజ్రోత్సవ వేడుకలు.. ముఖ్య అథితిగా సీఎం కేసీఆర్

ఇదిలా ఉండగా.. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అర్థరాత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ మద్యం కుంభకోణంలో కేసీఆర్ కుటుంబం ప్రమేయం కూడా ఉందని తాను చెప్పారు. ఈ విష‌యంలో నేను మ‌రింత తెలుసుకోవాల‌ని, త‌రువాత ఈ అంశంపై వ్యాఖ్యానిస్తాన‌ని అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios