Asianet News TeluguAsianet News Telugu

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక: అభ్యర్ధిగా జానారెడ్డి.. కాంగ్రెస్ ప్రకటన

నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్ధిగా మాజీ మంత్రి జానారెడ్డిని అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. గురువారం గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన మాణిక్యం ఠాగూర్.. ఈ విషయాన్ని తెలిపారు. 

K Jana Reddy contest from Nagarjuna Sagar as congress candidate ksp
Author
Hyderabad, First Published Jan 7, 2021, 6:39 PM IST

నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్ధిగా మాజీ మంత్రి జానారెడ్డిని అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. గురువారం గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన మాణిక్యం ఠాగూర్.. ఈ విషయాన్ని తెలిపారు. 

టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణంతో నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. సిట్టింగ్ స్థానాన్ని మళ్లీ నిలబెట్టుకోవాలని టీఆర్ఎస్.. దుబ్బాక తరహాలో ఇక్కడ కూడా సత్తా చాటాలని బీజేపీ వ్యూహారచన మొదలుపెట్టాయి.

Also Read:సాగర్ ఉపఎన్నిక వరకు ఉత్తమ్‌దే బాధ్యత: కొత్త పీసీసీపై ఠాగూర్ ప్రకటన

ఇక గతంలో తమ సిట్టింగ్ స్థానంగా ఉన్న ఈ సీటును మరోసారి తమ సొంతం చేసుకోవాలని కాంగ్రెస్ యోచిస్తోంది. ఇక్కడి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డికే ఆ పార్టీ ఛాన్స్ ఇచ్చింది. 

ఇక కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలను పాటిస్తామని రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహా ఇతర కాంగ్రెస్ నేతలంతా అంగీకరించినట్టు తెలుస్తోంది. నాగార్జునసాగర్‌లో కాంగ్రెస్ గెలుపు చాలా ముఖ్యమని.. పార్టీ గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో కచ్చితంగా గెలవాలని కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర నేతలకు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది

Follow Us:
Download App:
  • android
  • ios