నాగార్జున సాగర్ ఉప ఎన్నిక తర్వాతే టీపీసీసీకి కొత్త చీఫ్ నియామకం ఉంటుందన్నారు కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్యం ఠాగూర్.

హైదరాబాద్‌ గాంధీ భవన్‌లో గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన... కొత్త పీసీసీ చీఫ్ వచ్చే వరకు ఉత్తమ్ కుమార్ రెడ్డే అధ్యక్షుడిగా కొనసాగుతారని వెల్లడించారు.

Also Read:తెలంగాణ పీసీసీ చీఫ్ ఎంపిక: రేవంత్ రెడ్డికి కొలికి, అధిష్టానానికి తలబొప్పి

సోనియా గాంధీకి తెలంగాణలో పరిస్ధితిని వివరించినట్లు ఠాగూర్ చెప్పారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక తర్వాతే పీసీసీ చీఫ్ ఎంపికకు సోనియా అంగీకరించారని వివరించారు. కాంగ్రెస్ నేతల్లో చాలా మంది ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారని ఠాగూర్ పేర్కొన్నారు.