చర్లపల్లి జైల్లో దిశ హత్యకేసు నిందితులు: తొలి రోజే మటన్ తో భోజనం...
ఆదివారం జైలు నిబంధనల ప్రకారం ఖైదీలకు మాంసాహారాన్ని అందజేయడం జరుగుతుంది. అందులో భాగంగా నలుగురు నిందితులు ఆదివారం రాత్రి మటన్ తో భోజనం చేసినట్లు జైలు సిబ్బంది తెలిపారు.
హైదరాబాద్: జస్టిస్ ఫర్ దిశ హత్య కేసులో నిందితులకు చర్లపల్లి జైల్లో మెుదటి రోజే మటన్ కర్రీతో భోజనం పెట్టారు జైలు సిబ్బంది. దిశ హత్యకేసులో శనివారం షాద్ నగర్ మెజిస్ట్రేట్ నిందితులకు 14 రోజుల పాటు రిమాండ్ విధించారు.
లోక్ సభలో దిశహత్యపై చర్చకు రేవంత్ పట్టు: స్పీకర్ ఓం బిర్లా విచారం
రిమాండ్ విధించడంతో షాద్ నగర్ పోలీసులు నిందితులను కట్టుదిట్టమైన భద్రత నడుమ చర్లపల్లిజైలుకు తరలించారు. చర్లపల్లి జైల్లో మెుదటి రోజైన ఆదివారం నిందితులకు మటన్ తో భోజనం పెట్టారు జైలు సిబ్బంది.
నిందితులైన మహ్మద్ ఆరిఫ్, చెన్నకేశవులు, నవీన్, జొల్లు శివలకు ఆదివారం ఉదయం టిఫిన్ గా పులిహోర అందజేశారు. జేలు నిబంధనల ప్రకారం మధ్యాహ్నాం భోజనంలో 250 గ్రాముల ఆహారాన్ని అందజేశారు.
చర్లపల్లికి ప్రియాంక నిందితులు: హై సెక్యూరిటీ బ్లాక్‌లో సెల్, ఖైదీ నెంబర్లు ఇవే
ఆదివారం జైలు నిబంధనల ప్రకారం ఖైదీలకు మాంసాహారాన్ని అందజేయడం జరుగుతుంది. అందులో భాగంగా నలుగురు నిందితులు ఆదివారం రాత్రి మటన్ తో భోజనం చేసినట్లు జైలు సిబ్బంది తెలిపారు.
ఇకపోతే బుధవారం సాయంత్రం దిశని నలుగురు నిందితులు అత్యంత దారుణంగా రేప్ చేసి హత్య చేశారు. తొడుపల్లి దగ్గర దిశ స్కూటీ పార్క్ చేయడం చూసిన లారీ డ్రైవర్ మహ్మాద్ పాషా ఉద్దేశపూర్వకంగా ఆమె స్కూటీ పంక్చర్ అయ్యిందని కుట్ర పన్నారు.
తెలంగాణ నిర్భయ కేసు: నిందితుల కస్టడీ కోసం పోలీసుల పిటిషన్
కేసులో ఏ3గా ఉన్న జొల్లు నవీన్ స్కూటీ బ్యాక్ టైర్ లో గాలి తీసేశారు. గచ్చిబౌలి నుంచి దిశ తొండుపల్లి వద్దకు రాగానే బ్యాక్ టైర్ పంక్చర్ అయ్యిందని నమ్మించారు. పంక్చర్ వేయిస్తామని చెప్పగానే ఆమె స్కూటీ ఇచ్చేసింది. పంక్చర్ వేయిస్తామని తీసుకెళ్లిన వారు గాలి కొట్టించి తిరిగి ఇచ్చేశారు.
ప్రియాంక నిందితులకు షాక్: వాదించేది లేదు, బార్ అసోసియేషన్ తీర్మానం
అనంతరం ఆమెను కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. అత్యాచార సమయంలో యువతి కేకలు వేయడంతో నోరు మూయడంతో ఊపిరి ఆడక చనిపోయినట్లు పోలీసులు నిర్థారించారు. అనంతరం చటాన్ పల్లి బ్రిడ్జ్ దగ్గర కిరోసిన్ పోసి నిప్పంటించి తగుటబెట్టారు.
తెలంగాణ నిర్భయ కేసు: నిందితుల కస్టడీ కోసం పోలీసుల పిటిషన్
ఇకపోతే హత్య కేసులో డ్రైవర్ ఏ1మహ్మద్ ఆరిఫ్, ఏ2 క్లీనర్ జొల్లు శివ (20), ఏ3 జొల్లు నవీన్ (23), ఏ4 క్లీనర్ చెన్న కేశవులు (లారీ డ్రైవర్)ను అరెస్ట్ చేసినట్లు సీపీ సజ్జనార్ మీడియాకు స్పష్టటం చేశారు. తెలిపారు. వైద్యురాలి హత్య కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు సీపీ సజ్జనార్ తెలిపారు.
ఇకపోతే నిందితులు ప్రస్తుతం చర్లపల్లి జైల్లో రిమాండ్ లో ఉన్నారు. ఇకపోతే తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశాలతో కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టును నియమించింది తెలంగాణ ప్రభుత్వం. వీలైనంత త్వరలో కేసు విచారణ పూర్తి చేసి నిందితులకు శిక్ష విధించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.
ప్రియాంకరెడ్డి హత్య కేసు:ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు నిందితులు, కస్టడీ కోరే అవకాశం