Asianet News TeluguAsianet News Telugu

లోక్ సభలో దిశహత్యపై చర్చకు రేవంత్ పట్టు: స్పీకర్ ఓం బిర్లా విచారం

మల్కాజ్ గిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి లోక్ సభలో వాయిదా తీర్మాణం ప్రవేశపెట్టారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరుగుపోతున్నాయని ఆరోపించారు. దిశ హత్యపై లోక్ సభలో చర్చ జరపాలని డిమాండ్ చేశారు. 

Justice for Disha: Telangana congress mp reventh reddy demands discussion over disha incident
Author
New Delhi, First Published Dec 2, 2019, 11:20 AM IST

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్య కేసుపై లోక్ సభలో చర్చకు పట్టుబట్టారు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు. లోక్ సభలో చర్చించాలని డిమాండ్ చేస్తూ ఎంపీలు వాయిదా తీర్మాణం ఇచ్చారు. 

మల్కాజ్ గిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి లోక్ సభలో వాయిదా తీర్మాణం ప్రవేశపెట్టారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరుగుపోతున్నాయని ఆరోపించారు. దిశ హత్యపై లోక్ సభలో చర్చ జరపాలని డిమాండ్ చేశారు. 

దిశ హత్య ఘటన తమను కలచివేసిందని స్పష్టించారు. ఇలాంటి ఘటనను ప్రతీ ఒక్కరూ ఖండించాల్సిందేనన్నారు. దిశ హత్య ఘటనపై తాను తీవ్రంగా విచారం వ్యక్తం చేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా స్పష్టం చేశారు. జీరో అవర్లో దిశ ఘటనపై చర్చిద్దామని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా స్పష్టం చేశారు. మధ్మాహ్నాం 12 గంటలకు లోక్ సభలో దిశ ఘటనపై చర్చ జరపనున్నట్లు తెలిపారు. 

ఇకపోతే బుధవారం సాయంత్రం దిశని నలుగురు నిందితులు అత్యంత దారుణంగా రేప్ చేసి హత్య చేశారు. తొడుపల్లి దగ్గర దిశ స్కూటీ పార్క్ చేయడం చూసిన లారీ డ్రైవర్ మహ్మాద్ పాషా ఉద్దేశపూర్వకంగా ఆమె స్కూటీ పంక్చర్ అయ్యిందని కుట్ర పన్నారు. 

కేసులో ఏ3గా ఉన్న జొల్లు నవీన్ స్కూటీ బ్యాక్ టైర్ లో గాలి తీసేశారు. గచ్చిబౌలి నుంచి దిశ తొండుపల్లి వద్దకు రాగానే బ్యాక్ టైర్ పంక్చర్ అయ్యిందని నమ్మించారు. పంక్చర్ వేయిస్తామని చెప్పగానే ఆమె స్కూటీ ఇచ్చేసింది. పంక్చర్ వేయిస్తామని తీసుకెళ్లిన వారు గాలి కొట్టించి తిరిగి ఇచ్చేశారు.

అనంతరం ఆమెను కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. అత్యాచార సమయంలో యువతి కేకలు వేయడంతో నోరు మూయడంతో ఊపిరి ఆడక చనిపోయినట్లు పోలీసులు నిర్థారించారు. అనంతరం చటాన్ పల్లి బ్రిడ్జ్ దగ్గర కిరోసిన్ పోసి నిప్పంటించి తగుటబెట్టారు. 

ఇకపోతే హత్య కేసులో డ్రైవర్‌ ఏ1మహ్మద్ ఆరిఫ్, ఏ2 క్లీనర్‌ జొల్లు శివ (20), ఏ3 జొల్లు నవీన్‌ (23), ఏ4 క్లీనర్‌ చెన్న కేశవులు (లారీ డ్రైవర్‌)ను అరెస్ట్ చేసినట్లు సీపీ సజ్జనార్ మీడియాకు స్పష్టటం చేశారు. తెలిపారు. వైద్యురాలి హత్య కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు సీపీ సజ్జనార్‌ తెలిపారు. 

ఇకపోతే నిందితులు ప్రస్తుతం చర్లపల్లి జైల్లో రిమాండ్ లో ఉన్నారు. ఇకపోతే తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశాలతో కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టును నియమించింది తెలంగాణ ప్రభుత్వం. వీలైనంత త్వరలో కేసు విచారణ పూర్తి చేసి నిందితులకు శిక్ష విధించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. 

చర్లపల్లి జైల్లో దిశ హత్యకేసు నిందితులు: తొలి రోజే మటన్ తో భోజనం

Follow Us:
Download App:
  • android
  • ios