హైదరాబాద్: శంషాబాద్‌లో గ్యాంగ్‌రేప్ కు గురై సజీవ దహనానికి గురైన దిశ కేసులో పోలీసులు కీలకమైన ఆధారాలను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపనున్నారు. నిందితులకు శిక్ష పడేందుకు ఈ ఆధారాలు కీలకం కానున్నాయి.ఇప్పటికే కొన్ని ఆధారాలను పోలీసులు సేకరించారు.

బైక్ పంక్చర్ చేయిస్తామని చెప్పి ఒంటరిగా ఉన్న దిశను మాయామాటలతో నమ్మించిన నలుగురు దుండగలు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. అంతేకాదు ఆమెను మృతదేహాన్ని తగులబెట్టారు.

దిశ కేసులో ఆధారాలు లభ్యం కాకుండా ఉండేందుకు గాను మృతదేహాన్ని దగ్దం చేశారు. దీంతో శాస్త్రీయ ఆధారాలను సేకరించే పనిలో పడ్డారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితులను పోలీసులు 24 గంటల్లో అరెస్ట్ చేశారు.

షాద్ నగర్ సమీపంలోని చటాన్ పల్లి అండర్ పాస్ బ్రిడ్జి కింద దిశ మృతదేహాన్ని దహనం చేశారు. ఈ మృతదేహం వద్ద దొరికిన కొన్ని ఆధారాలను పోలీసులు సేకరించారు. 

సగం కాలిన దుప్పటి , ప్యాంట్ జిప్, సగం కాలిన బెల్ట్ తదితర వస్తువులను క్లూస్ టీమ్ సేకరించింది. తొండుపల్లి టోల్ గేట్ కు సమీపంలో రోడ్డు పక్కనే ఉన్న గోడ పక్కన అత్యాచారానికి పాల్పడినట్టుగా పోలీసులు గుర్తించారు.

ఈ ప్రాంతంలోనే ఉన్న రూమ్ లో బాధితురాలిని తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడాలని భావించారు.ఆ రూమ్ తలుపులు బద్దలుకొట్టే ప్రయత్నం చేశారు. సాధ్యం కాలేదు. ఆ రూమ్ కిటీకి గుండా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే కిటీకి అద్దాలను ధ్వంసం చేశారు. 

రూమ్ లోకి వెళ్లడం సాధ్యం కాదని భావించిన తర్వాతే గోడ పక్కనే దిశపై అత్యాచారానికి పాల్పడినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. గోడ పక్కనే బాధితురాలి లోదుస్తులు, గుర్తింపు కార్డు, చెప్పులను స్వాధీనం చేసుకొన్నారు. 

క్లూస్ టీమ్ సేకరించిన ఆధారాలను పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపుతారు. క్లూస్ టీమ్ సేకరించిన ఆధారాల్లో కచ్చితత్వం కోసం డిఎన్ఏ నమూనాలు లభిస్తే నిందితుల డిఎన్ఏ నమూనాలను కూడ సేకరించే అవకాశాలు లేకపోలేదు.

Also raad:'దిశ'పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు: శ్రీరామ్ అరెస్ట్

మరోవైపు నిందితులను పోలీస్ కస్టడీకి తీసుకొని ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయాలని షాద్ నగర్ పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి.ఇప్పటికే ఈ కేసులో పోలీసుల నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తాయి. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లపై సైబరాబాద్ సీపీ సజ్జనార్ సస్పెన్షన్ వేటేశాడు.

Also read:15 రోజుల క్రితమే అమ్మమ్మ: దిశ ఫ్యామిలీపై దెబ్బ మీద దెబ్బ

ఈ కేసుకు సంబంధించిన కీలక ఆధారాలను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపనున్నారు పోలీసులు. అంతేకాదు నిందితులకు శిక్ష పడడంలో ఈ ఆధారాలు కీలకంగా మారనున్నాయి. దీంతో ఈ ఆధారాల కోసం పోలీసులు కేంద్రీకరించారు.

Also read:జస్టిస్ ఫర్ దిశ: వెటర్నరీ డాక్టర్ కావడానికి కారణమిదే