'దిశ'పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు: శ్రీరామ్ అరెస్ట్

దిశపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన యువకుడు శ్రీరామ్ ను హైద్రాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. 

Sriram arrested for abusing comments on Disha on Social media

నిజామాబాద్: శంషాబాద్ వద్ద దిశపై గ్యాంగ్‌రేప్, హత్య ఘటనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీరామ్‌ అనే యువకుడిని హైద్రాబాద్ సీసీఎస్ పోలీసులు  అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో  మరో ముగ్గురి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Also read:15 రోజుల క్రితమే అమ్మమ్మ: దిశ ఫ్యామిలీపై దెబ్బ మీద దెబ్బ

 

Sriram arrested for abusing comments on Disha on Social media

శంషాబాద్ గ్యాంగ్‌ రేప్ ఘటన తర్వాత ఫేస్‌బుక్ లో గ్రూప్‌గా ఏర్పడి శ్రీరామ్ గ్యాంగ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. రేప్ చేస్తే తప్పేంటి అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది.ఈ వ్యాఖ్యలపై  సీసీఎస్ పోలీసులు సుమోటోగా తీసుకొన్నారు. కేసు నమోదు చేశారు.

టెక్నికల్ అంశాలను ఆధారంగా చేసుకొని  ఈ పోస్టులు ఎక్కడి నుండి వచ్చాయో పోలీసులు గుర్తించారు. నిజామాబాద్ జిల్లా బషీరాబాద్ గ్రామానికి చెందిన శ్రీరామ్ గా గుర్తించారు. శ్రీరామ్ ను మంగళవారం నాడు సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీరామ్ గ్యాంగ్ నలుగురు గ్రూప్‌గా ఏర్పడి దిశ గ్యాంగ్ రేప్, హత్య ఘటనపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.

Sriram arrested for abusing comments on Disha on Social media

దిశపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఘటనపై రాజశేఖర్ అనే వ్యక్తి కూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దిశ హంతకులు ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్నారు. నిందితులను తమ కస్టడీకి ఇవ్వాలని షాద్ నగర్ పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై షాద్ నగర్ కోర్టు మంగళవారం నాడు నిర్ణయం తీసుకోనుంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios