హైదరాబాద్: నలుగురు మృగాళ్ల చేతిలో అత్యంత దారుణంగా అత్యాచారానికి గురై హత్యకు చేయబడిన దిశ అత్యంత సున్నిత స్వభావం కలదని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.ఈ కారణంగానే ఆమె మూగజీవాలకు సేవ చేసే వృత్తిని ఎంచుకొన్నట్టుగా ఆమె స్నేహితులు గుర్తు చేస్తున్నారు.

also read:పరిస్థితులకు అనుగుణంగా పోలీసులకు శిక్షణ: స్వాతి లక్రా

ఉమ్మడి మహాబూబ్ నగర్ జిల్లాలోని నవాబుపేట మండలంలోని కొల్లూరు గ్రామంలో మూడేళ్లుగా దిశ పశు వైద్యురాలిగా పనిచేస్తున్నారు. ఈ ఆసుపత్రికి పశువుల వైద్యం కోసం వచ్చేవారి పట్ల ఆమె ఏనాడూ పరుషంగా మాట్లాడలేదు. పశువులను ఆసుపత్రికి తీసుకొచ్చే పరిస్థితులు లేకపోతే ఆమె తన బైక్ పై పశువులు ఎక్కడ ఉన్నాయో అక్కడికి చేరుకొనేది.

పశువుల యజమానుల బైక్ మీద కాకుండా తన స్వంత బైక్ పై తన సహాయకుడితో కలిసి పశువులకు చికిత్స చేసేందుకు ఆమె వెళ్లేది. కొన్ని సమయాల్లో ఆమె తన బైక్ పై వెళ్లేది. 

కొందరు పశువుల యజమానులకు మందులు కొనుగోలు చేసుకొనే స్థోమత లేని సమయాల్లో డాక్టర్ దిశ  తన స్వంత డబ్బులతో మందులను కొనుగోలు చేసి ఇచ్చేది.దిశను అత్యాచారం చేసి హత్య చేసిన విషయం తెలిసిన కొల్లూరు గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు. ఆమె గురించి తలుచుకొని మదనపడుతున్నారు. 

దిశ నివాసం ఉండే కాలనీలో కూడ ఆమె గురించి ఏ ఒక్కరూ కూడ వ్యతిరేకంగా మాట్లాడలేదు. ప్రతి ఒక్కరిని కూడ అక్కా అంటూ ఆమె సంబోధించేదని కాలనీవాసులు గుర్తు చేసుకొంటున్నారు.పిలిస్తే కానీ పలకదు. తన పని తాను చేసుకొంటూ వెళ్లిపోయదని కాలనీవాసులు గుర్తు చేసుకొంటున్నారు.

దిశ కుటుంబ సభ్యులు కూడ చాలా మంచివాళ్లని తమ పిల్లల మాదిరిగానే కాలనీలో ఉండే వారిని కూడ వాళ్లు చూసేవారని కాలనీవాసులు చెబుతున్నారు. ఉదయం తన డ్యూటీకి వెళ్లి వచ్చి సాయంత్రం కుటుంబసభ్యులతో ఆమె ఇంట్లోనే ఉండిపోయేదని కాలనీవాసులు చెబుతున్నారు.

కాలనీవాసులతో కూడ దిశ కలివిడిగా ఉండేదని ఎవరితో కూడ ఆమె ఏనాడూ పరుషంగా కూడ మాట్లాడలేదని కాలనీవాసులు గుర్తు చేస్తున్నారు. ప్రతి రోజూ తల్లితో కలిసి ఆమె వాకింగ్ వచ్చిన తమను చిరునవ్వుతో పలకరించేదని కాలనీవాసులు గుర్తు చేసుకొని కన్నీళ్లు పెట్టుకొంటున్నారు.