హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలంగాణ వైద్యురాలు దిశ హత్య కేసులో నిందితుడికి షాక్ ఇచ్చింది భార్య. నిందితుడైన భర్త తనకు వద్దు అంటూ స్పష్టం చేసింది. దిశను అత్యంత కృరంగా అత్యాచారం చేసి హత్య చేయడం తనను కలచివేసిందని అలాంటి వ్యక్తికి భార్యగా తాను ఉండాలనుకోవడం లేదని తెలిపింది. 

తెలంగాణ వైద్యురాలు దిశపై అత్యాచారం, హత్య ఘటనలో ఏ4 నిందితుడు చెన్నకేశవులు. లారీ డ్రైవర్ గా పనిచేస్తున్న చెన్నకేశవులు గత నెల 27న పశువైద్యురాలు దిశపై రేప్, హత్యచేసిన నిందితుల్లో ఒకరు. 

ఇకపోతే చెన్నకేశవులు ఈ ఏడాది రేణుక అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం చెన్నకేశవులు భార్య గర్భిణీ. తన భర్త చేసిన దారుణాన్ని తలచుకుని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. తన భర్తకు ఫుల్ గా మద్యం తాగించి ఇలాంటి దారుణానికి ఒడిగట్టించారని ఆరోపించారు. 

తన భర్తకు ఉరివేయోద్దని తాను కోరనని తెలిపారు. తన భర్తను తనకు అప్పగించాలని కోర్టును కోరినంత మాత్రాన తనకు అప్పగిస్తుందా అని నిలదీశారు. ఒక ఆడబిడ్డ జీవితాన్ని నాశనం చేశారు కాబట్టి నలుగురికి ఎలాంటి శిక్ష వేశారో తన భర్తకు కూడా అలాంటి శిక్షే వేయాలని ఆమె సూచించారు. 

ఇకపోతే తన భర్త కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడని రేణుక స్పష్టం చేసింది. అందువల్ల గత కొద్దిరోజులుగా ఇంటి దగ్గరే ఉంటున్నాడని అయితే స్నేహితులు వచ్చి తీసుకెళ్లడంతో ఈ ఘోరానికి పాల్పడ్డారని వాపోయింది. 

చెన్నకేశవులు గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ప్రతీ ఆర్నెళ్లకోసారి నిమ్స్ ఆస్పత్రిలో డయాలసిస్ చేయించుకుంటున్నాడు. మెడికల్ రిపోర్ట్ లో కూడా అదే తేలడంతో జైలు సిబ్బంది సైతం ఆర్నెళ్లకోసారి డయాలసిస్ చేయిస్తామని తెలిపారు.

Justice for Disha: నిందితుడికి ప్రాణాంతక వ్యాధి, ఆర్నెళ్లకోసారి

తల్లిదండ్రులు సైతం చెన్నకేశవులు చేసిన పనిని తలచుకుని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెన్నకేశవులు పుట్టినప్పుడు తాము ఎంతో సంతోషించామని అయితే ఇలాంటి పనులు చేసినందుకు బాధపడుతున్నట్లు తెలిపారు. 

దేశవ్యాప్తంగా నిందితులను ఉరితియ్యాలని అంతా కోరుతున్నారని కోర్టు ఎలాంటి శిక్ష వేసినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ఒకవేళ ఉరివేస్తే తమకు కొడుకు పుట్టలేదని అనుకుంటామని తల్లిదండ్రులు చెప్తున్నారు. 

ఇకపోతే నలుగురు నిందితులు స్వగ్రామమైన గుడిగండ్ల, జక్లేర్ లలో ఆందోళనలు మిన్నంటాయి. దిశను రేప్ చేసి అత్యంత కిరాతకంగా హత్య చేసిన నిందితులు తమ గ్రామాలకు చెందిన వారే కావడంతో గ్రామస్థులు అంతా ఆగ్రహంతో రగిలిపోతున్నారు.

ఇంకెంతమంది ప్రియాంకలు బలవ్వాలి: ఆడపిల్లను కాపాడుకోలేమా, తల్లిదండ్రుల కన్నీటి ఆవేదన  

దేశానికి, గ్రామానికి తలవంపులు తెచ్చారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తులు తమ గ్రామంలో పుట్టడం వల్ల తమకు చాలా సిగ్గుగా ఉందని ప్రజలు ఆరోపిస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, ఇంకెప్పుడు భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

ఈనెల 27న సాయంత్రం దిశను షాద్ నగర్ లో అత్యంత దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ దారుణానికి ఒడిగట్టిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ముహ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు నిందితులు ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్నారు.  

'దిశ'పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు: శ్రీరామ్ అరెస్ట్