షాద్‌నగర్: శంషాబాద్ సమీపంలో జస్టిస్ ఫర్ దిశ( తెలంగాణ నిర్భయ)పై గ్యాంగ్ రేప్‌కు పాల్పడి, హత్య చేసిన నలుగుు నిందితులను కస్టడీ కోరుతూ పోలీసులు సోమవారం నాడు షాద్‌నగర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

 శంషాబాద్  సమీపంలో  ఐదు రోజుల క్రితం జస్టిస్ ఫర్ దిశపై  నలుగురు నిందితులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడి హత్య చేశారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Also Read:తెలంగాణ నిర్భయ... కీలకంగా లారీ యజమాని సాక్ష్యం, ఉరిశిక్ష ఖాయం?

నిందితులను చర్లపల్లి జైలుకు తరలించారు. ప్రస్తుతం నిందితులు చర్లపల్లి జైలులో ఉన్నారు. చర్లపల్లి జైలులో ఉన్న నిందితుల నుండి మరింత సమాచారాన్ని సేకరించాలని పోలీసులు భావిస్తున్నారు. దీంతో పోలీసులు షాద్‌నగర్ కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు.

ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని సేకరించాలని పోలీసులు భావిస్తున్నారు. మరో వైపు ఈ విషయమై శాస్త్రీయ ఆధారాలను సేకరించాలని పోలీసులు యోచిస్తున్నారు. దరిమిలా పోలీసులు నిందితులను మరింత లోతుగా విచారణ చేయాలని తలపెట్టారు.

Also read:వైద్యురాలి పేరు వాడొద్దు... ఇకపై జస్టిస్ ఫర్ దిషాగా పిలవాలి: సీపీ సజ్జనార్

ఈ విచారణలో భాగంగానే పోలీసులు  నిందితులను తమ కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయం  తీసుకొన్నారు. ఈ నిర్ణయంలో భాగంగానే పోలీసులు షాద్‌నగర్ కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. 

Also Read:డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య: ఆ ముగ్గురూ పోకీరీలే, బైక్‌పై డేంజర్ సింబల్

షాద్ నగర్ కోర్టులో జస్టిస్ ఫర్ దిశ పై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుల కస్టడీ కోరుతూ పోలీసులు సోమవారం నాడు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు.ఈ కస్టడీ పిటిషన్ పై  షాద్ నగర్ కోర్టులో విచారణ సాగుతోంది.