తెలంగాణ నిర్భయ హత్య: నిందితుల వీడియో తీసిన కానిస్టేబుల్ సస్పెన్షన్
తెలంగాణ రాష్ట్రంలో జస్టిస్ దిశ హత్య కేసులో నిందితుల వీడియో తీసిన కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తూ జైళ్ల శాఖ నిర్ణయం తీసుకొంది.
హైదరాబాద్: తెలంగాణ నిర్భయ హత్య కేసులో నిందితులను చర్లపల్లి జైలులో వీడియో తీసిన కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు వేసింది జైళ్ల శాఖ. ఈ ఏడాది నవంబర్ 30వ తేదీన నిందితులు నలుగురిని చర్లపల్లి జైలుకు తరలించారు. చర్లపల్లి జైలులో ఉన్న నలుగురు నిందితులను కానిస్టేబుల్ వీడియో తీశాడు. ఈ విషయమై జైళ్ల శాఖ సీరియస్ గా స్పందించింది.
Also Read:ఈనెల 13లోపు దిశ ఘటనపై మోదీ ఒక ప్రకటన ఇవ్వాలి: వైసీపీ ఎంపీ రఘురామ
జైలులో ఉన్న నిందితుల వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. మీడియాలో కూడ ఇవే మీడియాలో ప్రసారమయ్యాయి. దీంతో చర్లపల్లి జైలులో ఉన్న నిందితులను ఎవరు వీడియో తీశారనే విషయమై జైళ్ల శాఖ ఆరా తీసింది.ఈ వీడియోలు తీసిన కానిస్టేబుల్‌ను రవిగా గుర్తించారు. రవిపై సస్పెన్షన్ వేటేశారు.
Also read:ఆలస్యం చేయోద్దు, వెంటనే ఉరితియ్యండి: రాజ్యసభలో ఏఐఏడీఎంకే ఎంపీ విజిల
మరోవైపు షాద్‌నగర్ కోర్టులో నిందితుల కస్టడీ పిటిషన్ వేశారు పోలీసులు. అయితే ఈ కేసులో నిందితుల తరపున వాదించకూడదని కోరుతూ ఉమ్మడి మహాబూబ్‌నగర్ జిల్లాకు చెందిన బార్ అసోసియేషన్ నిర్ణయం తీసుకొంది. న్యాయవాదులు షాద్‌నగర్ కోర్టు వరకు సోమవారం నాడు ర్యాలీ నిర్వహించారు.
Also read:దిశ హత్య కేసులో పోలీసుల నిర్లక్ష్యం, డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు అభ్యంతరం: ఉత్తమ్ కుమార్ రెడ్డి