హైదరాబాద్: తన అక్క నందమూరి సుహాసినికి మద్దతుగా నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారానికి వచ్చే అవకాశం లేదని సమాచారం. ఆయనతో పాటు కల్యాణ్ రామ్ కూడా దూరంగా ఉండే అవకాశం ఉంది. కల్యాణ్ రామ్ సతీమణి మాత్రం సుహాసినితో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. మరో నందమూరి నటుడు తారకరత్న ప్రచారం చేస్తున్నారు. 

సుహాసినికి మద్దతు తెలియజేస్తూ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ఇప్పటికే ఓ ప్రకటనను విడుదల చేశారు. అయితే, వారిద్దరు ప్రచారంలో పాల్గొంటారని భావించారు. అయితే, ఎన్టీఆర్ ప్రచారానికి వచ్చే అవకాశం లేదని అంటున్నారు.

ప్రకటన వరకే పరిమితం కావాలని, అంతకు మించి ఎన్నికల్లో జోక్యం చేసుకోకూడదని ఎన్టీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ సినిమా షూటింగులో బిజీగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లతో కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది.

నందమూరి హీరో, ఎపి శాసనసభ్యుడు బాలకృష్ణ వారిద్దరి కోసం వాకబు చేస్తున్నట్లు సమాచారం. వారితో ఆయన మాట్లాడినట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి.  కూకట్ పల్లిలో జూనియర్ ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఖరారు కాలేదు. 

ప్రచారంలో పాల్గొనాలనుకుంటే ముందే ఎన్నికల కమిషన్ కు లేఖ పెట్టి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఎన్టీఆర్ ఇప్పటి వరకు ఆ ప్రయత్నం చేసిన దాఖలాలు లేవు. దీంతో ఎన్టీఆర్ సుహాసిని ప్రచారానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

జోరుగా బెట్టింగ్: సుహాసిని కూకట్ పల్లి సీటు హాట్ కేక్

రాజకీయనాయకుల్లా మాట్లాడటం చేతకాదు.. సుహాసిని

సుహాసినికి ప్రచారం: మరో ఐదు రోజులు హైదరాబాదులో చంద్రబాబు

సుహాసినికి మద్దతుగా..ప్రచారం చేసిన కళ్యాణ్ రామ్ భార్య

నందమూరి సుహాసినికి షాక్...ప్రచారానికి రానన్న భువనేశ్వరి

సుహాసిని కోసం ఎన్నికల ప్రచారానికి ఏపీ మంత్రి సునీత

నందమూరి సుహాసిని తలుపుతట్టిన అదృష్టం...ఎలా అంటే