హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ఎన్నికలపై బెట్టింగ్ రాయుళ్లు రంగంలోకి దిగారు. జోరుగా పందేలు కాస్తున్నారు. నందమూరి హరికృష్ణ కూతురు నందమూరి సుహాసిని పోటీ చేస్తున్న కూకట్ పల్లి నియోజకవర్గం వారికి హాట్ కేక్ లో మారింది. ఈ సీటుపై తెలంగాణలో కన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎక్కువ బెట్టింగ్ నడుస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. 

గజ్వెల్ లో తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావు మెజారిటీపై పందేలు కాస్తున్నారు. కేసీఆర్ పై కాంగ్రెసు నేత వంటేరు ప్రతాప రెడ్డి ప్రజా కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

మరో హాట్ సీటు కాంగ్రెసు నేత రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న కొడంగల్. ఇటీవలి కాలం దాకా రేవంత్ రెడ్డి విజయం ఖాయమనుకున్న స్థితిలో ఆయన ఓడిపోతారా, గెలుస్తారా అనే విషయంపై ఎక్కువగా పందేలు కాస్తున్నట్లు తెలుస్తోంది.

కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డిపై తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సోదరుడు పట్నం నరేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి ఆయన గట్టి పోటీ ఇస్తున్నట్లు చెబుతున్నారు. 

పందెంరాయుళ్లు సొంతంగా కూడా సర్వేలు నిర్వహించి బెట్టింగులు కాస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. 

సంబంధిత వార్తలు

రాజకీయనాయకుల్లా మాట్లాడటం చేతకాదు.. సుహాసిని

సుహాసినికి ప్రచారం: మరో ఐదు రోజులు హైదరాబాదులో చంద్రబాబు

సుహాసినికి మద్దతుగా..ప్రచారం చేసిన కళ్యాణ్ రామ్ భార్య

నందమూరి సుహాసినికి షాక్...ప్రచారానికి రానన్న భువనేశ్వరి

సుహాసిని కోసం ఎన్నికల ప్రచారానికి ఏపీ మంత్రి సునీత

నందమూరి సుహాసిని తలుపుతట్టిన అదృష్టం...ఎలా అంటే