మహాకూటమి అభ్యర్థిగా టీడీపీ తరపున కూకట్ పల్లి నియోజకవర్గానికి నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. ఆమె పోటీపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి, సుహాసిని మేనేత్త భువనేశ్వరి తొలిసారి స్పందించారు.

తన కోడలు సుహాసిని గెలుపై తనకు పూర్తి విశ్వాసం ఉందన్నారు.  సుహాసిని తరపున ఇప్పటికే పలువురు ప్రముఖులు ఎన్నికల ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. తాను మాత్రం ప్రచారంలో పాల్గొనడం లేదని భువనేశ్వరి స్పష్టతనిచ్చారు. ఈ సందర్భంగా సుహాసినికి భువనేశ్వరి శుభాకాంక్షలు తెలియజేశారు.

సుమారు 33 సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ కుటుంబం నుంచి ఒకరు తెలంగాణ గడ్డపై బరిలో నిలవడంతో ఆమె పోటీ ప్రతిష్టాత్మకంగా మారింది. సుహాసినీ గెలుపు కోసం నందమూరి కుటుంబం రంగంలోకి దిగుతోంది.

ఇప్పటికే బాబాయ్ బాలకృష్ణ అన్ని దగ్గరుండి చూసుకుంటుండగా.. సోదరులు కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ త్వరలో ప్రచారంలో పాల్గొంటారు. ఇక టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మేనకోడలి కోసం తెర వెనుకు నుంచి చక్రం తిప్పుతున్నారు.

read more news

సుహాసిని కోసం ఎన్నికల ప్రచారానికి ఏపీ మంత్రి సునీత

నందమూరి సుహాసిని తలుపుతట్టిన అదృష్టం...ఎలా అంటే

సుహాసినిని గెలిపించండి: హీరో తారకరత్న ఎన్నికల ప్రచారం