హైదరాబాద్: తెలంగాణలో యురేనియం తవ్వకాలపై స్పందించారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. భావితరాలకి, బంగారు తెలంగాణ ఇస్తామా...? యురేనియం కాలుష్యం తెలంగాణ ఇస్తామా...? అని నిలదీశారు. ఈ అంశంపై ప్రజా సంఘాలు, రాజకీయ పక్షాలు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. 

ఇకపోతే ఈనెల 9న హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హన్మంతరావు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. యురేనియం తవ్వకాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు.  

ఈ సందర్భంగా యురేనియం తవ్వకాల వల్ల రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముప్పు వాటిల్లుతుందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. యురేనియం తవ్వకాల వల్ల కృష్ణా జలాలు కలుషితమవుతాయని తెలిపారు. గర్భిణులు ఆ కలుషిత నీరు తాగితే పుట్టే బిడ్డ మానసిక వైకల్యానికి గురయ్యే ప్రమాదం ఉందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. 

ఈ వార్తలు కూడా చదవండి

ప్రజాసమస్యలపై పోరాటం అంటే ముందుండే నాయకుడు పవన్ కళ్యాణ్: కాంగ్రెస్ నేత వీహెచ్

పవన్ కళ్యాణ్ తో కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ భేటీ

యురేనియం తవ్వకాలు తెలుగు రాష్ట్రాలకు ముప్పు: జనసేనాని పవన్ కళ్యాణ్