హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ లోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో భేటీ అయ్యారు. 

సుమారు గంటన్నరపాటు పవన్ కళ్యాణ్ తో పలు అంశాలపై చర్చించారు వి.హనుమంతరావు. పార్టీ ఫిరాయింపులు, కాపు రిజర్వేషన్ల అంశం, తెలుగు రాష్ట్రాల్లో ప్రజా వ్యతిరేక విధానాలపై ఇరువురు నేతలు చర్చించారు. 

ప్రధానంగా ఇరువురు నేతల మధ్య బీసీ రిజర్వేషన్లు, కాపు  రిజర్వేషన్ల అంశాలపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో యురేనియం తవ్వకాలను నిరసిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన నిరసనలకు మద్దతు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ ను వీహెచ్ కోరినట్లు సమాచారం.